Shukr Gochar in November 2025: నవంబర్ నెలలో శుక్రుడు సంచారంలో కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. అదృష్టానికి, ఐశ్వర్యానికి కారకుడైన శుక్రుడు ఐదు సార్లు తన గమనాన్ని మార్చబోతున్నారు. వచ్చే నెల ప్రారంభంలో అంటే నవంబర్ 02న తన సొంత రాశి అయిన తులా రాశిలోకి, 07న స్వాతి నక్షత్రంలోకి, 13న విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. అలాగే వచ్చే నెల చివరిలో అంటే నవంబర్ 26న వృశ్చికరాశిలోకి, 29న అనురాధ నక్షత్రంలోకి వెళ్లబోతున్నాడు. శుక్రుడు స్థానంలో మార్పులు కారణంగా యెుక్క మూడు రాశులవారు మంచి ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో తెలుసా?
మకరరాశి
మకర రాశి వారికి నవంబర్ నెల కలిసి రాబోతుంది. జాబ్ కు సంబంధించిన శుభవార్త వింటారు. పాలిటిక్స్ లో ఉన్నవారికి ఈ సమయానికి అనుకూలంగా ఉంటుంది. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. పని కోసం ప్రయత్నించే వారికి ఉపాధి దొరుకుతుంది. పిల్లలు లేనివారు సంతానం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంసార జీవితం బాగుంటుంది.
వృషభ రాశి
శుక్రుడు సంచారం వృషభరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు శాలరీతోపాటు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. ప్రతి పనిలో అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు.
సింహ రాశి
నవంబర్ నెల సింహరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. శుక్రుడు స్థాన మార్పు సింహరాశి వారికి ఊహించని ఫలితాలను ఇవ్వబోతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి వస్తాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. కొత్త వెహికల్ కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పూర్తిగా నిజమైనదని మేము ఖచ్చితంగా చెప్పలేము. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని రూపొందించడం జరిగింది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయత లేదు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


