Shukra Gochar 2025 effect: వైదిక జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని అందం, ఐశ్వర్యం, లగ్జరీ లైఫ్ మరియు ప్రేమకు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. పంచాంగం ప్రకారం, శుక్రుడు సెప్టెంబరు 15న సింహరాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడి రాశిలో శుక్రుడు సంచారం వల్ల కొందరి తలరాత మారబోతుంది. శుక్రుడు రాశి మార్పు వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శుక్రుడు సంచారం ఎంతో మేలు చేస్తుంది. మీరు ఆర్థికంగా స్థిరపడతారు. కొత్త మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. మీరు కోరుకున్న వ్యక్తితోనే వివాహం జరుగుతుంది. కెరీర్ టర్న్ అవుతుంది. మీ సంపద వృద్ధి చెందుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం దొరుకుతుంది. మీరు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు.
సింహరాశి
శుక్రుడు సంచారం సింహరాశి వారి తలరాతను మార్చబోతుంది. మీ లవ్ సక్సెస్ అవుతుంది. కెరీర్ పీక్స్ లో ఉంటుంది. ఆర్థికంగా మంచి పురోగతి సాధిస్తారు. పెళ్లికి సంబంధించిన శుభవార్త వింటారు. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. మీరు భారీగా డబ్బును పొదుపు చేస్తారు. మీ పనులున్న అనుకున్న సమయానికి సక్రమంగా పూర్తవుతాయి.
Also Read: Kanya Sankranthi 2025 -కన్య సంక్రాంతితో ఈ 4 రాశులకు గోల్డెన్ డేస్.. మీ రాశి కూడా ఉందా?
మేషరాశి
శుక్రుడు రాశి మార్పు మేషరాశి వారికి అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఊహించని ప్రయోజనాలు పొందుతారు. కెరీర్ లో పురోగతికి అవకాశం ఉంది. వ్యాపారులు అనుకోని లాభాలను పొందుతారు. వ్యాపారం లాభసాటిగా మారుతుంది. లక్ ఎల్లప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. గతంలో మీ దగ్గర రుణం తీసుకున్నవారు ఇప్పుడు చెల్లిస్తారు. ఉద్యోగ, వ్యక్తిగత జీవితం బాగుంటుంది.
Disclaimer:పైన ఇచ్చిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పాఠకుల ఆసక్తి మేరకు పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా రూపొందించడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


