Friday, December 12, 2025
HomeదైవంVenus Transit 2025: నవరాత్రులకు ముందు శుక్రుడు సంచారం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా...

Venus Transit 2025: నవరాత్రులకు ముందు శుక్రుడు సంచారం.. ఈ 3 రాశుల వారు పట్టిందల్లా బంగారం..

Venus Transit in leo 2025 effect: ఆస్ట్రాలజీలో శుక్ర గ్రహాన్ని శుభ గ్రహంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలో శుక్రుడు శుభ స్థానంలో ఉంటాడో వారి అదృష్టం మారుతుంది. అలాంటి వీనస్ ప్రతి నెలా తన రాశిని మారుస్తాడు. సెప్టెంబరులో కూడా తన కదలికలను ఛేంజ్ చేయనున్నాడు ఈ నెల 15న శుక్రుడు సింహరాశి ప్రవేశం చేయనున్నాడు. సూర్యుడి రాశిలోకి శుక్రుడి ప్రయాణం కొన్ని రాశులవారిని ధనవంతులను చేయనుంది. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.

- Advertisement -

తులా రాశి
తులా రాశి వారికి శుక్రుడు సంచారం అద్భుతంగా ఉండబోతుంది. మీరు ఆర్థికంగా స్థిరత్వం పొందుతారు. కెరీర్ సాఫీగా సాగుతుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంది. సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్ వింటారు. వ్యాపారాలు చేసేవారు పెద్ద పెద్ద కాంట్రాక్టులు కుదుర్చుకుంటారు. దీంతో వీరు భారీగా డబ్బు సంపాదించే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కుదుట పడుతుంది. శుక్రుడు సంచార సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు ఊహించని లాభాలను ఇస్తాయి.

వృషభరాశి
శుక్రుడి సంచారం వృషభరాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. వీరి జీవితం ఆనందమయం అవుతోంది. కెరీర్ లో ఆకస్మిక ఎదుగుదల ఉంటుంది. ఎంతో కాలంగా నిలిచిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. మీ మంచి మాటతీరు మీకు మేలు చేస్తుంది. ఆరోగ్యం చాలా బాగుంటుంది. భారీగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. సంసార జీవితం సాఫీగా సాగుతోంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ఉంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహా యోగం ఉంది. వృత్తిలో పురోగతి సాధిస్తారు. వ్యాపారంలో బోలెడు లాభాలు ఉంటాయి.

Also Read: Ganesh Nimajjanam-గణపయ్య నిమజ్జనం సమయంలో ఈ తప్పులు చేస్తే.. మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!

వృశ్చిక రాశి
శుక్రుడు రాశి మార్పు వృశ్చిక రాశి తలరాతను మార్చబోతుంది. ఉద్యోగంలో ఆకస్మిక ప్రమోషన్ పొందుతారు. భార్యభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. లగ్జరీ లైఫ్ ను అనుభవిస్తారు. లైఫ్ పార్టనర్ తో మంచి రొమాంటిక్ సమయం గడుపుతారు. మీరు పనిలో పురోగతి సాధిస్తారు. మీరు చేసిన ప్రాజెక్టు విజయవంతం అవ్వడంతో..మిమ్మల్ని మీ బాస్ ప్రశంసలతో ముంచెత్తుతారు. జాబ్ లేని వారికి ఉద్యోగం దొరుకుతుంది. కెరీర్ లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. మీ కృషికి తగిన ప్రతిఫలాలు లభిస్తాయి.

Also Read: Naraka chaturdashi 2025-ఈ ఏడాది నరక చతుర్దశి ఎప్పుడు? యమ దీపం ఎందుకు వెలిగిస్తారు?

Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. దీనిని జ్యోతిష్య నిపుణుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా రూపొందించడమైనది. ఈ వార్తను తెలుగు ప్రభ ధృవీకరించలేదు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News