Venus Transit in Cancer 2025: ఆగస్టు 21న కర్కాటక రాశిలో శుక్ర సంచారం జరగబోతోంది. అదే సమయంలో బుధుడు కూడా అదే రాశిలో సంచరిస్తాడు. వీరిద్దరి కలయిక కారణంగా శక్తివంతమైన లక్ష్మీనారాయణ యోగం రూపొందుతుంది. ఇదే సమయంలో చంద్రుడు కూడా కర్కాటక రాశి ప్రవేశం చేయనున్నాడు. దీని కారణంగా అరుదైన త్రిగ్రాహి యోగం రూపుదిద్దుకోనుంది. లక్షీనారాయణ యోగం వల్ల ఏయే రాశుల వారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
మిథునరాశి
లక్ష్మీనారాయణ యోగం వల్ల మిథునరాశి వారు ప్రయోజనం పొందబోతున్నారు. ఈరాశి వారికి అదృష్టంతోపాటు అఖండమైన ధనం కూడా పొందబోతున్నారు. కెరీర్ లో ఊహించని గ్రోత్ ఉంటుంది. మీరు జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. వైవాహిక జీవితం సాఫీగా సాగుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని లాభాలు ఉంటాయి. వివాహా యోగం ఉంది. సంతానం ప్రాప్తికి అవకాశం ఉంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధించే అవకాశం ఉంది.
కర్కాటక రాశి
శుక్రుడు, బుధుడు కలయిక వల్ల ఏర్పడబోతున్న లక్ష్మీనారాయణ యోగం కర్కాటక రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న జాబ్ రానే వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి శాలరీ రెట్టింపు అవ్వడంతోపాటు ప్రమోషన్ కూడా రావచ్చు. వ్యాపారులు మంచి లాభాలను పొందడంతోపాటు బిజినెస్ ను విస్తరిస్తారు. వ్యక్తిగత జీవితం బాగుంటుంది. అనారోగ్యం నుంచి బయటపడతారు. అదృష్టం ఉంటుంది. దాంపత్య జీవితంలోని కలతలన్నీ తొలగిపోయి భార్యభర్తలు అన్యోన్యంగా జీవిస్తారు.
Also Read: Jupiter Transit 2025 – ఆగస్టులో బృహస్పతి ద్విసంచారం..ఈ 3 రాశులు పట్టిందల్లా బంగారం..
కన్యా రాశి
ఆగస్టు 21న ఏర్పడబోతున్న శుభప్రదమైన యోగం వల్ల కన్యారాశి వారి తలరాత మారనుంది. కెరీర్ లో ఊహించని ఎదుగుదల ఉంటుంది. బిజినెస్ లో ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు. ఆకస్మిక ధన లాభం ఉంటుంది. పెళ్లికాని యువతీ యువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది. లక్ కలిసి వస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. మీ చింతలన్నీ తొలగిపోతాయి. మానసిక ప్రశాంతతను అనుభవిస్తారు. ఉద్యోగ ప్రాప్తి ఉంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.


