Shukra Gochar 2025 in August: వైదిక జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని అదృష్టం, ఐశ్వర్యం, ప్రేమ, రొమాన్స్, లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. శుభాలినిచ్చే శుక్రుడు ఆగస్టు 23న పుష్యమి నక్షత్ర ప్రవేశ చేయబోతున్నాడు. శుక్రుడు యెుక్క ఈ నక్షత్ర మార్పు వల్ల ఐదు రాశులవారు ఊహించని ప్రయోజనాలను పొందబోతున్నారు. ఆ రాశులు ఏవో ఒక్కసారి తెలుసుకుందాం.
మిథునరాశి
మిథున రాశి వారికి శుక్రుని నక్షత్ర సంచారం ఎంతో మేలు చేయబోతుంది. మీ పని తీరు మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఇంతక ముందు కంటే బాగుంటుంది. భారీగా బంగారం లేదా విలువైన వస్తువులు కొనుగోలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.
మీన రాశి
శుక్రుడి సంచారం మీనరాశి వారి తలరాతను మార్చబోతుంది. మీరు కెరీర్ లో విజయం సాధిస్తారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. వ్యాపారులు ఊహించని లాభాలను పొందుతారు. విద్యార్థులు చదువులో రాణిస్తారు.ప్రతి పనిలో అదృష్టం మీతోనే ఉంటుంది.
కన్య రాశి
కన్య రాశి వారికి శుక్రుడు శుభఫలితాలను ఇవ్వబోతున్నాడు. మీ కోరికలు నెరవేరుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఉద్యోగాలు చేసేవారికి శాలరీ పెరగడంతోపాటు పదోన్నతి కూడా దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.
Also read: Dasara 2025- ఈ ఏడాది దసరా ఎప్పుడు? పండుగ విశిష్టత ఏంటో తెలుసా?
కర్కాటక రాశి
పుష్యమి నక్షత్రంలో శుక్ర సంచారం కర్కాటక రాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. మీరు ఆర్థికంగా మంచి పొజిషన్ కు చేరుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగప్రాప్తి కలుగుతుంది. లైఫ్ పార్టనర్ తో మంచి రొమాటింక్ సమయం గడుపుతారు.
వృషభరాశి
శుక్రుడు సంచారం వల్ల వృషభరాశి వారికి కలిసి రాబోతుంది. ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు. కెరీర్ లో ఎన్నడూ చూడని పురోగతిని చూస్తారు. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా మారుతాయి. బిజినెస్ చేసేవారికి కొత్త పార్టనర్స్ దొరుకుతారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం మిమ్మల్నే వరిస్తుంది.
Also Read: Ketu Planet- ఆ 4 రాశులను కోటీశ్వరులను చేయనున్న కీడు గ్రహం.. ఇందులో మీది ఉందా?
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


