Shukra Gochar 2025: వేద జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని ప్రేమ, అందం, విలాసం మరియు సంపదకు కారకుడిగా భావిస్తారు. అలాంటి శుక్రుడు ఆగస్టు 21న తెల్లవారుజామున 1:25 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. పైగా ఈ రాశిని చంద్రుడు పాలిస్తాడు. శుక్రుడు సంచారం సెప్టెంబరు 15 వరకు ఉండబోతుంది. కర్కాటక రాశిలో శుక్రుని సంచారం ఏ రాశుల వారికి బాగుంటుందో తెలుసుకుందాం?
తులారాశి
తుల రాశి యెుక్క పాలక గ్రహం శుక్రుడు. ఈ సంచారం మీ రాశి యెుక్క 10వ ఇంట్లో జరగబోతుంది. మీ తెలివితేటలు, నాయకత్వ లక్షణాలతో అందరి ప్రశంసలు పొందుతారు. ఆఫీసులో పదోన్నతితోపాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇదే అనుకూల సమయం. ఇతరులతో సంబంధాలు బాగుంటాయి. మీ కెరీర్ వృద్ధి చెందుతుంది. మీ ప్రతిష్ఠ పెరుగుతుంది.
మీనరాశి
శుక్రుని సంచారం మీనరాశి యెుక్క ఐదో ఇంట్లో జరుగుతుంది. పెళ్లి ఈడు వచ్చినవారికి వివాహ కుదిరే అవకాశం ఉంది. వివాహితులకు సంతానప్రాప్తి కలుగుతుంది. కళ, రచన, సంగీతం రంగాల్లో ఉన్నవారు తమ ప్రతిభను కనబరుస్తారు. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తారు. కెరీర్ కు సంబంధించిన శుభవార్త వింటారు.
మేషరాశి
శుక్రుడు మేషరాశి యెుక్క నాల్గవ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీ కుటుంబ జీవితంలోకి ఆనందం మరియు శాంతి వస్తుంది. ఇంటి కోసం కొత్త ఫర్నిచర్ కొనడానికి ఇదే అనుకూల సమయం. రియల్ ఎస్టేట్‌లో ఉన్నవారు కోట్లకు పడగలెత్తుతారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అవివాహితులకు పెళ్లి కుదిరే అవకాశం ఉంది. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. నూతన దంపతులు మంచి సమయం గడుపుతారు.
Also Read: Sun Transit 2025- హస్త నక్షత్రంలోకి సూర్యుడు.. ఈ 3 రాశులకు ఆఖండ ధనయోగం..
కర్కాటక రాశి
కర్కాటక రాశి యెుక్క మొదటి ఇంట్లో శుక్రుడు సంచరించబోతున్నాడు. మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడుతుంది. మీరు ఆత్మవిశ్వాసంతో ఎలాంటి కార్యాన్నైనా సాధించగలుగుతారు. భార్యభర్తలు రొమాంటిక్ జీవితం గడుపుతారు. కళ, సంగీతం లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు ప్రయోజనం పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మీకు అనుకూలిస్తాయి.
Also Read: Pithori Amavasya 2025- పిథోరి అమావాస్య ఎప్పుడు? దీని విశిష్టత ఏంటి?
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


