Shukra Gochar 2025 in July: జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడును శుభకరమైన గ్రహంగా భావిస్తారు. లవ్, రొమాన్స్, సంపద, లగ్జరీ లైఫ్ కు కారకుడిగా శుక్రుడిని పిలుస్తారు. అలాంటి శుక్రుడు జూలై 26న మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. మిథునరాశికి అధిపతి బుధుడు. పైగా వీనస్, మెర్క్యూరీ ప్రెండ్స్ కూడా. దీంతో మిథునరాశిలో శుక్రుడు సంచారం నాలుగు రాశులవారికి అనుకూలంగా ఉండబోతుంది. ఆ రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం.
మిథున రాశి
ఇదే రాశిలోకి శుక్రుడు వెళ్లబోతున్నాడు. మీరు వ్యక్తిగత, వృత్తి జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో మీరు అనుకోని శుభవార్త వింటారు. ఆర్థికంగా అనూహ్యస్థాయికి చేరుకుంటారు. కెరీర్ లో ఎన్నడూ చూడని పురోగతి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అపాయ్యత, అనురాగాలు పెరుగుతాయి. మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. కార్యసాధనలో ముందుకు వెళతారు.
ధనుస్సు రాశి
ధనస్సు రాశివారికి శుక్రుడు సంచారం చాలా లాభాలను తెచ్చిపెడుతుంది. మీ కెరీర్ లో ఎప్పుడు చూడని అభివృద్ధిని చూస్తారు. ఇతరులతో మీ స్నేహ సంబంధాలు పెరుగుతాయి. మీరు కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ పనిని నలుగురు మెచ్చుకుంటారు. మీ పాత అప్పులన్నీ తీరిపోతాయి. మీ జీవితంలో శాంతి, సుఖం లభిస్తాయి. మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారు.
కుంభ రాశి
శుక్రుని సంచారం కారణంగా కుంభ రాశి వారు ఎన్నెన్నో లాభాలు పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు ఆకస్మికంగా పెరుగుతాయి. మీ పనులన్నీ సమయానికి పూర్తవుతాయి. కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి. మీ బ్యాంక్ బ్యాలెన్స్ భారీగా పెరుగుతుంది. మీరు అప్పులు ఊబి నుండి విముక్తి పొందుతారు.
తులా రాశి
తులారాశి వారికి శుక్రుడు గోచారం ఎక్కడా లేని గౌరవాన్ని తీసుకురాబోతుంది. మీ వ్యక్తిత్వం నలుగురిని ఆకట్టుకుంటారు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులకు జాబ్ దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు ఊహించని లాభాలను ఇస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.


