Venus Transits 2025 in Tula Rashi: ప్రతి నెలా కొన్ని గ్రహాలు తమ రాశిచక్రాలను మారుస్తాయి. అదృష్టంతోపాటు ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కూడా సెప్టెంబరులో తన రాశిని ఛేంజ్ చేయనున్నాడు. శుక్రుడు తన సొంత రాశి అయిన తుల రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇతడు ఏడాదికొకసారి తన రాశిని మారుస్తాడు. శుక్రుడు సొంత రాశి ప్రవేశం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
తులా రాశి
ఇదే రాశిలో శుక్రుడు గోచారం జరగబోతుంది. బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగిపోతుంది. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ ఆత్మవిశ్వాసంతోపాటు ధైర్యం కూడా పెరుగుతుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. పెళ్లికాని యువతీయువకులకు వివాహా యోగం ఉంది. మీ కెరీర్ లో ఊహించని విజయం ఉంటుంది. అప్పుల భారం నుండి బయటపడతారు. మీకు ఆనందంతోపాటు ఐశ్వర్యం కూడా ఉంటుంది.
కుంభ రాశి
శుక్రుడు సంచారం కుంభరాశివారికి అద్భుతంగా ఉండబోతుంది. మీకు ఆకస్మిక ధనంతోపాటు ఊహించని లాభాలు కలుగనున్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడులు త్వరలో భారీగా ప్రాఫిట్స్ ఇవ్వబోతున్నాయి. మీరు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. అంతేకాకుండా తీర్థయాత్రలతోపాటు విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంది. వైవాహిక, వ్యక్తిగత జీవితంలో అదృష్టం ఉంటుంది. కెరీర్ లో అందనంత ఎత్తుకు చేరుకుంటారు. మీ లవ్ సక్సెస్ అవుతుంది.
మకర రాశి
మకరరాశి వారికి శుక్రుడు సంచారం అదృష్టాన్ని ఇవ్వబోతుంది. మీరు కెరీర్ లో ఊహించని విజయాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు మీకు అనుకూలిస్తాయి. వ్యాపారులు భారీ లాభాలను పొందుతారు. మీ జీవితంలో ఆనందంతోపాటు ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. పాత పరిచయాలు అనుకూలిస్తాయి. వైవాహిక, వ్యక్తిగత జీవితాలు బాగుంటాయి. ఆఫీసులో మీ పనిని అందరూ మెచ్చుకుంటారు. వివాహయోగంతోపాటు సంతాన సౌభాగ్యం కూడా ఉంది.
Also read: Janmashtami 2025- నేడే కృష్ణాష్టమి.. శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..
Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను ఇవ్వడమైనది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


