Venus Transit 2025 Effect: జ్యోతిష్యశాస్త్రంలో శుభగ్రహంగా, ప్రకాశవంతమైన గ్రహంగా శుక్రుడిని భావిస్తారు. మన జాతకంలో శుక్రుడు స్థానం బలంగా ఉంటే దేనికీ లోటు ఉండదు. ఆనందం, శృంగారానికి కారకుడైన శుక్రుడు జూన్ 29న వృషభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. పైగా ఆ రాశి శుక్రుడు యెుక్క సొంత రాశి కావడం విశేషం. ఈ మార్పు మూడు రాశులవారికి బాగా కలిసిరానుంది. దీంతో వారు రాత్రిరాత్రికి కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. సొంతరాశిలో శుక్రుడు సంచారం వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.
తులారాశి
వృషభరాశిలో శుక్రుడు సంచారం తులారాశి వారికి కనివినీ ఎరుగుని లాభాలను చేకూర్చనుంది. దారిద్ర్యం దాదాపు తొలగిపోతుంది. లవ్ సక్సెస్ అవుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. ఎందులోనైనా ఇన్వెస్ట్ చేయడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు రెట్టింపు లాభాలను ఇస్తాయి. కోరిన కోరికలు సిద్ధిస్తాయి. ఆర్థికంగా బలపడతారు. వివాహం కాని యువతీయువకులు పెళ్లి కుదిరే అవకాశం అయితే ఉంది.
మేషరాశి
మేష రాశి వారికి శుక్రుడు సంచారం ఎంతో మేలు చేస్తుంది. వీరి కష్టాలన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు తొలగిపోయి హ్యాపీగా ఉంటారు. పూర్వీకుల ఆస్తులు కలిసొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. అనుకున్న పనులు సమయానికి పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగం వస్తుంది. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
సింహరాశి
శుక్రుడి యెుక్క ఈ రాశి మార్పు సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. వీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. దుబారాను భారీగా తగ్గించి..పొదుపుపై దృష్టి పెడతారు. వీరికి అనేక మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అప్పుల భారం నుండి బయటపడతారు. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ మెుదలుపెట్టడానికి ఇదే మంచి టైం. సంతానప్రాప్తి కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితం బాగుంటుంది. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంది. ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను చూస్తారు.