Saturday, November 15, 2025
HomeదైవంVijayadashami: రేపే దసరా.. లక్మీ దేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసా?

Vijayadashami: రేపే దసరా.. లక్మీ దేవి అనుగ్రహం కోసం ఏం చేయాలో తెలుసా?

- Advertisement -

Vijayadashami: హిందూ పండుగల్లో అత్యంత ప్రాధాన్యత గల దసరా పండుగ రేపే వస్తుంది. పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు మధ్య కోలాహలంగా జరుపుకునేందుకు అందరూ సిద్ధమవుతున్నారు. అయితే, దసరా రోజు ఏం చేయాలో చాలా మందికి తెలియదు. విషయాలేంటో తెలుసుకుందాం.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమిని జరుపుకుంటారు. హిందూ సంప్రదాయంలో ఈ పండుగకు ప్రత్యేక స్థానం ఉంది. ఈరోజు హిందూ సంప్రదాయాలు, ధర్మశాస్త్రాలు నిర్దేశించిన కొన్ని నియమాలను తప్పక పాటించాలి. 
దసరా రోజున ముఖ్యంగా ఆయుధ పూజ లేదా వాహన పూజ చేస్తారు. ఉద్యోగులు తమ పనిముట్లకు, వ్యాపారులు తమ యంత్రాలకు, రైతులు తమ వ్యవసాయ పరికరాలకు పూజలు చేయడం శుభప్రదం. ఇది వాటిని కాపాడుతుందని, మంచి ఫలితాలు ఇస్తుందని విశ్వాసిస్తారు.
విజయదశమి నాడు సాయంత్రం జమ్మి చెట్టు (శమీ వృక్షం) వద్దకు వెళ్లి పూజ చేయడం అత్యంత ముఖ్యమైన ఆచారం. పాండవులు అజ్ఞాతవాసం ముగించి జమ్మి చెట్టుపై దాచిన ఆయుధాలను తీసుకున్న సందర్భాన్ని ఇది గుర్తు చేస్తుంది. జమ్మి ఆకులను ఇచ్చిపుచ్చుకొని ఆలింగనం చేసుకోవడం వల్ల సోదర భావం పెరుగుతుందని, సకల విజయాలు, ధన లాభాలు కలుగుతాయని నమ్మకం.
దసరా రోజు ఉదయాన్నే ఇంటిని శుభ్రం చేసి, ముంగిట రంగులతో రంగవల్లికలు (ముగ్గులు) వేసి అలంకరించాలి. అమ్మవారి ముందు దీపం ముట్టించి నైవేద్యం సమర్పించాలి. లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఇది ముఖ్యమైనదిగా భావిస్తారు. అంతేకాదు పిల్లా పెద్దలు కొత్త బట్టలతో ముస్థాబవుతారు. పిండి వంటలతో ఇళ్లు కళకలలాడుతుంది.
దసరా పండుగ సందర్భంగా ఇంటి ఇలవేల్పుకు నైవేద్యం సమర్పించి, ఇంటిల్లిపాది ఆశీస్సులు తీసుకోవాలి. ముఖ్యంగా పెద్దల పాదాలకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.
విజయదశమిని శుభ ముహూర్తంగా భావిస్తారు. కాబట్టి కొత్త వ్యాపారం, ఉద్యోగంలో చేరడం, విద్య ప్రారంభించడం వంటి ఏ కొత్త ప్రయత్నం చేసినా విజయం లభిస్తుంది. ఈ రోజు పాల పిట్టను చూడటం శుభసూచికంగా భావిస్తారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad