Lord Ganesha’s Favourite Zodiac Signs: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, కొన్ని రాశులవారికి వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతారు. దీని కారణంగా వారు కెరీర్ లో ఊహించని పురోగతిపాటు కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆగస్టు 27న వినాయక చవితి పండుగను జరుపుకోనున్నారు. ఈ క్రమంలో గణేశుడికి ఇష్టమైన రాశులు ఏవో తెలుసుకుందాం.
కన్యారాశి
గణపతి అనుగ్రహంతో కన్యారాశి వారి ప్రణాళికలు ఫలిస్తాయి. బిజినెస్ భారీగా వృద్ధి చెందుతుంది. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. వైవాహిక జీవితంలో ఉన్న కలతలన్నీ తొలగిపోతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి వినాయకుడి కృప మెుండుగా ఉంటుంది. ప్రయాణాలు ఊహించని లాభాలను ఇస్తాయి. విద్యార్థులు చదువులో మంచి మార్కులు సాధిస్తారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ప్రతి పనిలో విజయం మిమ్మల్నే వరిస్తుంది.
కుంభరాశి
గణేశుడి ప్రత్యేక ఆశీస్సులు కుంభరాశి వారికి ఉంటాయి. మీరు అదృష్టంతోపాటు పురోగతి కూడా సాధిస్తారు. మీరు ఎలాంటి సమస్యకైనా సులభంగా పరిష్కరిస్తారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. పోటీపరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు కొలువు సాధించే అవకాశం ఉంది. సంతానసుఖం కలుగుతుంది. సంసార జీవితం బాగుంటుంది.
Also read: Vinayaka Chavithi 2025-వినాయక చవితి పూజలో దోసకాయ ఎందుకు పెడతారో తెలుసా?
వృషభరాశి
వృషభరాశికి చెందిన వ్యక్తులకు వినాయకుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని చెబుతారు. మీకు ప్రతి పనిలో విజయం సిద్ధిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. మీ సంపద వృద్ధి చెందుతుంది. సంసారం జీవితం సాఫీగా సాగుతోంది.
సింహరాశి
సింహరాశి వారికి గణపయ్య కటాక్షం మెండుగా ఉంటుంది. మీ పని లేదా వ్యాపారాల్లో ఉన్న అడ్డంకులను వినాయకుడు తొలగిస్తాడు. వినాయకుడి కృప వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. మీ చేపట్టిన ప్రాజెక్టును సక్సెస్ పుల్ చేస్తారు. మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. డబ్బు భారీగా సంపాదిస్తారు.
Also read: Mahabhagya Yogam – నేడు కుజుడు-చంద్రుడు కలయిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..


