Sunday, November 16, 2025
HomeదైవంVinayaka Chavithi 2025: వినాయక చవితి రోజు ఉపవాసం ఉండాలా?

Vinayaka Chavithi 2025: వినాయక చవితి రోజు ఉపవాసం ఉండాలా?

Ganesh Chaturthi 2025 Fasting Rules: దేశవ్యాప్తంగా హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో వినాయక చవితి ఒకటి. దీనిని నార్త్ ఇండియాలో గణేష్ చతుర్థి అని పిలుస్తారు. ఇది పది రోజులపాటు జరుపుకునే పండుగ. ఈ సంవత్సరం ఈ వేడుకను ఆగస్టు 26 నుండి సెప్టెంబరు 06 వరకు జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున భక్తులు గణేష్ విగ్రహాలను ఇంటికి తీసుకొచ్చి పూజ గదిలో ప్రతిష్టించి ప్రార్థనలు చేస్తారు. ఈ విగ్రహాలను అనంత చతుర్దశి రోజున దగ్గరలో ఉన్న చెరువు లేదా నది లేదా సముద్రంలో నిమజ్జనం చేస్తారు. దీంతో ఈ పండుగ ముగుస్తుంది.

- Advertisement -

గణేష్ చతుర్థి శుభ ముహూర్తం

చతుర్థి తిథి ప్రారంభం – 26 ఆగస్టు 2025, 1:54 PM
చతుర్థి తిథి ముగింపు – 27 ఆగస్టు 2025, 3:44 PM
గణేశ పూజ ముహూర్తం – 27 ఆగస్టు 2025, 11:12 AM నుండి 01:
44 PM వరకు
గణేష్ నిమజ్జనం – శనివారం, 6 సెప్టెంబర్ 2025

గణేష్ చతుర్థి పూజా విధానం
వినాయక చవితి రోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం ఉపవాసం ఉంటూ.. ఇంటికి తెచ్చిన గణేశుడి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్టించాలి. అనంతరం విఘ్నకర్తను ఏక వింశతి అంటే 21 పత్రాలతో పూజించాలి. దేవుడికి ఇష్టమైన ఉండ్రాళ్లను నైవేద్యంగా పెట్టాలి. ఆ తర్వాత మంత్రాలు జపిస్తూ పాటలు పాడుతూ వినాయకుడిని ఆరాధించాలి.

చాలా మంది ఇళ్లలో నెలకొల్పిన వినాయకుడిని అదే రోజు నీళ్లలో కలిపేస్తారు. మరికొందరు అనంత చతుర్దశి వరకు ఆగుతారు. వీధుల్లో, ఊళ్లలో లేదా నగరాల్లో తీసిన విగ్రహాలను పదో రోజు అయిన అనంత చతుర్దశి నాడు భక్తులు ఊరేగింపుగా గణపతి బప్పా మోరియా నినాదాలు చేస్తూ తీసుకెళ్లి నదిలో నిమజ్జనం చేస్తారు. గణేశుడికి ఇష్టమైన మోతీచూర్ లడ్డూలను, ఉండ్రాళ్లను, పులిహోరను దారి పొడవునా పంచుతారు.

Also Read: Festivals in August 2025- Telugu Prabha Telugu Daily అన్ని పండుగలు, వ్రతాలు ఆగస్టులోనే.. లిస్ట్ ఇదే!

ఉపవాసం చేయాలా?

వినాయక చవితి రోజున ఉపవాసం ఉండాలా లేదా అనేది వారి వ్యక్తిగత విషయం. అనారోగ్యంతో ఉన్నవారు ఫాస్టింగ్ పాటించకపోవడం మంచిది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారు ఉపవాసాన్ని ఆచరిస్తూ గణేశుడిని పూజించండి. మీరు రోజంతా ఉండలేకపోతే గణేష్ పూజ అయ్యే వరకు అన్న ఉపవాసం ఉండండి. ఇలాంటి సమయంలో మన మనసును చాలా స్వచ్ఛంగా ఉంచుకోవాలి. ప్రతికూల ఆలోచనలను మనసులోకి రానివ్వకూడదు. భక్తి భావంతో మెలగాలి. ఈ సమయంలో మాంసాహారం జోలికి పోకండి. భోజనంలో ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకండి. వంటల్లో ఉప్పును వాడకండి.

Also Read: Varalakshmi Vratam – వరలక్ష్మి వ్రతం రోజు మీ రాశి ప్రకారం..ఏ రూల్స్‌ ఫాలో అవ్వాలంటే..

 

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad