Benefits Of Wearing Nose Rings: ముక్కుపుడక ఆడవారి అలంకరణలో ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దీనిని ‘నత్’ అని కూడా అంటారు. హిందూ సాంస్కృతిలో ముక్కుపుడకకు ప్రత్యేక గుర్తింపు కలిగి ఉంది. ముక్కపుడక అనేది భారతీయ సంప్రదాయంలో ఎన్నో శతాబ్దాలుగా వస్తున్న ఆభరణం. ఈ ముక్కపుడక అనేది ఒక్కో ప్రాంతం, సంప్రదాయాలు బట్టి దీని ఆకారం ఉంటుంది.
ఉదాహరణకు: చేప ఆకారం, చంద్ర వంక ఆకారం ఇలా ఎన్నో రకాలు ఉంటాయి. అయితే ముక్కుపుడక ఎందుకు ధరించాలి? భారతీయ సంస్కృతి ఏం చెబుతుంది? ముక్కుపుడక ధరించడం వల్ల కలిగే లాభాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
భారతీయ సంస్కృతిలో పెళ్ళైన స్త్రీలు ముక్కుపుడకను ధరిస్తారు. ఇలా ధరించడం వల్ల భర్త శ్రేయస్సు, దీర్ఘాయుష్షు పెరుగుతుందని భావిస్తారు. కొంతమంది స్త్రీలు ఈ ముక్కుపుడకను జీవితకాలం అంతా పెట్టుకుంటారు. ఈ ముక్కుపుడకను అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. దీని ఎక్కువగా శుభకార్యాలకు, పండుగ సమయంలో ఆడవారు వేసుకుంటారు.
ఈ ముక్కుపుడకను వివిధ రాష్ట్రాల్లో అనేక రకాలుగా ధరిస్తారు:
రాజస్థానీ నాథ్: ఈ ముక్కుపుడక గొలుసుతో ఉంటుంది. దీని చెవికి తగిలించుకుంటారు. ఈ రకమైన ముక్కుపుడకను ఎక్కువగా పెళ్ళైన స్త్రీలు ధరిస్తారు. వివిధ రకాల డిజైన్‌లో లభిస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ నాథ్: ముక్కుపుడక చూడడానికి పెద్దగా, సాధారణంగా బంగారంతో చేసిన రింగులను ధరిస్తారు.
మహారాష్ట్ర నాథ్: ఇది నెమలి ఆకారంలో లేదా బొట్టు ఆకారంలో ఉంటుంది. ఈ ముక్కుపుడక ఎక్కువగా ముత్యాలు, రత్నాలతో అలంకరించి ఉంటుంది.
దక్షిణ భారత: సాధారణంగా చిన్న వజ్రాలు లేదా రత్నాలతో ఉంటుంది. కొన్ని చోట్ల రెండు ముక్కు రంధ్రాలకు పుడకలు వేసుకుంటారు.
ముక్కుపుడక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:
భారతీయ సంప్రదాయంలో ముక్కుపుడకను లక్ష్మీదేవి, పార్వతి దేవికి చిహ్నంగా భావిస్తారు. ముక్కుపుడకలను ఎక్కువగా దేవి దేవతలు అలంకరిస్తారు. కొన్ని శాస్త్రాల ప్రకారం ముక్కుపుడక ధరించడం వల్ల ఐశ్వరం, అదృష్టం కలుగుతుందని నమ్ముతారు. అంతేకాకుండా పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది చెబుతుంటారు. కొంతమంది నిపుణుల ప్రకారం ముక్కుపుడక ధరించిన స్త్రీలలో వినయం పెరుగుతుందని చెబుతున్నారు.
ఆరోగ్య ప్రాముఖ్యత:
ముక్కుపుడక ధరించడం వల్ల ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి. ముఖ్యంగ ఋతుక్రమ సమయంలో వచ్చే నొప్పిని తగిస్తుందని చెబుతున్నారు. అలాగే గర్భధారణ సమయంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. ఎడమ వైపు ముక్కు పుడక పెట్టుకోవడం వల్ల ప్రసవం సులభంగా అవుతందని వైద్యులు చెబుతున్నారు. ముక్కుపుడక వల్ల మెదడు పనితీరు మెరుగుపడుతుంది ఆయుర్వేద శాస్త్రాలు చెబుతున్నాయి.