Sunday, June 8, 2025
HomeదైవంBlack Thread: కాళ్లకు నల్ల దారం ఎందుకు కడతారో మీకు తెలుసా?

Black Thread: కాళ్లకు నల్ల దారం ఎందుకు కడతారో మీకు తెలుసా?

Reasons Behind Tying Black Thread: భారతీయ సంస్కృతిలో కొన్ని నమ్మకాలు, ఆచారాలు ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్నాయి. అందులో ఒకటి కాలికి నల్ల దారం ధరించడం. నేటికాలంలో చాలా మంది చేతులకు, కాళ్లకు కట్టుకోవడం ఫ్యాషన్‌ గా మారింది. అంతేకాకుండా చాలా మంది వీటిని వివిధ రకాల డిజైనల్లో అమ్ముతున్నారు. కానీ దీని వెనుక కొన్ని నమ్మకాలు, ఆచారాలు దాగి ఉన్నాయని ఎవరికి తెలియదు. అసులు నల్ల దారం ఎందుకు కట్టుకోవాలి? దీని ధరించడం వల్ల కలిగే లాభాలు గురించి మనం తెలుసుకుందాం.

- Advertisement -

నల్ల దారం కట్టుకోవడానికి మొదటి కారణం దిష్టి/ నరదృష్టి తగలకుండా ఉండటం కోసం ఇలా చేస్తారు. కొందరు నల్ల పుసలు పుట్టిన పిల్లల చేతులకు కడుతుంటారు. ఇలా చేయడం వల్ల ఎవరి దృష్టి వల్ల ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుందని నమ్ముతారు. అలాగే అనుకున్న పనులు వెంటనే పూర్తి అవుతాయని భావిస్తారు.

నలుపు రంగు చెడు శక్తిని వెంటనే గ్రహిస్తుంది. అందుకే పెద్దలు “నరదృష్టికి నల్లరాయి అయినా పగులుతుంది”ని చెబుతుంటారు. నల్ల దారం కట్టుకోవడం వల్ల ఇతరుల చెడు శక్తి, నెగిటివ్‌ ఎనర్జీ, అసూయ పడకుండా రక్షిస్తుంది. ఈ దారం పుటిన పిల్లలకు మాత్రమే కాకుండా పెద్దలు, అందమైన యువతి, యువకులకు కూడా ధరించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి.

భారతీయ జ్యోతిష్య శ్రాసం ప్రకారం నల్ల రంగు శని గ్రహానికి చిహ్నం. శాస్రాల ప్రకారం శని దేవుడు ప్రతిఒక్కరి జీవితంలో కష్టాలు కలిగిస్తాడని నమ్ముతారు. శని ప్రభావం పడకుండా ఉండడానికి నల్ల దారం వేసుకుంటారు. ముఖ్యంగా జాతకంలో శని ప్రతికూల ప్రభావాలు తగ్గించడానికి ఈ దారాన్ని వేసుకుంటారు.

కొన్ని సంప్రదాయాల ప్రకారం నల్ల దారం కట్టుకోవడం వల్ల దైవిక శక్తి లభిస్తుంది చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల నెగిటివ్‌ ఎనర్జీ తొగలి పాజిటివ్‌ ఎనర్జీని పొందవచ్చని నమ్ముతారు నిపుణులు. మరి కొంతమంది మంత్రించిన దారాలను కట్టుకుంటారు.

నల్ల దారం ఎప్పుడు, ఎలా కట్టుకోవాలి?

నల్ల దారాన్ని ఎక్కువగా మంగళవారం లేదా శనివారం రోజున కట్టుకుంటారు. కొందరు ధరించే ముందు దేవుడి ముందు ఉంచి ఆ తరువాత కట్టుకుంటారు.

కాలికి నల్ల దారం కట్టుకోవడం అనేది ఒక ఆచారం. ఒకరి వ్యక్తిగత నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. అయితే మన సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటి వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవడం చాాాలా ముఖ్యం.

గమనిక: పైన తెలిపిన సమాచారం కేవలం అవగాహన పెంచుకోవడానికి మాత్రమే. ఏదైనా సందేహం ఉంటే నిపుణులను సంప్రదిచండి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News