HomeదైవంKalpvas 2026: కల్పవాసం అంటే ఏమిటి? దీని విశిష్టత మీకు తెలుసా?

Kalpvas 2026: కల్పవాసం అంటే ఏమిటి? దీని విశిష్టత మీకు తెలుసా?

Significance of Kalpvas 2026 in Telugu: ప్రయాగరాజ్ పుణ్యక్షేత్రంలో జరిగే అత్యంత పవిత్రమైన, కఠినమైన ఆధ్యాత్మిక క్రతువు ‘కల్పవాసం’. 2026 మాఘ మేళా సందర్భంగా గంగా, యమునా, సరస్వతీ నదుల త్రివేణి సంగమ తీరంలో జరిగే ఈ విశిష్ట ఆచారం గురించి, దాని నియమాలు మరియు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

కల్పవాసం అంటే ఏమిటి?
సాధారణ తీర్థయాత్రలకు, కల్పవాసానికి చాలా తేడా ఉంది. కల్పవాసం అంటే కేవలం నదిలో స్నానం చేసి రావడం కాదు, ఇది ఒక నెల రోజుల పాటు సాగే క్రమశిక్షణతో కూడిన జీవన విధానం. బాహ్య ప్రపంచపు విలాసాలకు దూరంగా, కేవలం దైవ చింతనలో గడపడమే దీని పరమార్థం. ‘కల్ప’ అంటే సమయం, ‘వాసం’ అంటే నివసించడం. నిర్ణీత కాలం పాటు పవిత్ర నదీ తీరంలో నియమబద్ధంగా నివసించడాన్నే కల్పవాసం అంటారు. ప్రయాగరాజ్‌లో మాఘ మాసం అంతా సంగమ తీరంలో గుడారాల్లో నివసిస్తూ, అత్యంత సాత్విక ఆహారం తీసుకుంటూ భక్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మాఘ మేళాను పురస్కరించుకుని ఈ సంవత్సరం కల్పవాసం జనవరి 3 నుండి ఫిబ్రవరి 15 వరకు (సుమారు 44 రోజులు) కొనసాగుతుంది.

కల్పవాస నియమాలు
కల్పవాసం ఆచరించే వారిని ‘కల్పవాసీలు’ అంటారు. వీరు కొన్ని కఠిన నియమాలను పాటించాల్సి ఉంటుంది. సాత్విక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి అంటే విలాసవంతమైన పరుపులు, మంచాలపై పడుకోకూడదు, కేవలం నేలపైనే నిద్రించాలి. రోజుకు ఒక్క పూట మాత్రమే సాత్విక ఆహారం తీసుకోవాలి. స్వయంగా వండుకుని తింటే మరి మంచిది. ప్రతిరోజూ సంగమ తీరంలో మూడు సార్లు స్నానం చేసి సంధ్యావందనం ఆచరించాలి. అనవసర మాటలు తగ్గించి, మౌనాన్ని పాటిస్తూ నిరంతరం దైవ నామస్మరణలో ఉండాలి. వ్రతం మొదలుపెట్టిన తర్వాత మధ్యలో ఇంటికి వెళ్లకూడదు. నిర్ణీత సమయం ముగిసే వరకు తీరంలోనే ఉండాలి.

Also Read: Vasant Panchami 2026 -సరస్వతీ పూజలో పసుపు రంగు దుస్తులే ఎందుకు ధరించాలి?

ఆధ్యాత్మిక ప్రయోజనాలు
ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల ఇంద్రియ నిగ్రహం ద్వారా మనసుపై నియంత్రణ లభిస్తుంది. పవిత్ర మాఘ మాసంలో సంగమ స్నానం చేయడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగుతాయని విశ్వాసం. తక్కువ సౌకర్యాలతో ఎలా సంతోషంగా ఉండవచ్చో కల్పవాసం నేర్పిస్తుంది కల్పవాసం అనేది కేవలం ఒక సంప్రదాయం కాదు, అది ఆత్మశోధన చేసుకునే ఒక గొప్ప అవకాశం. రణగొణ ధ్వనుల మధ్య సాగే యాంత్రిక జీవితానికి స్వస్తి చెప్పి, కొన్ని రోజుల పాటు ప్రకృతితో, పరమాత్మతో మమేకమవ్వడమే కల్పవాసంలోని అసలైన అంతరార్థం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News