Surya Gochar effect on zodiac Signs: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశిచక్రాలను మార్చి వేరొక రాశిలోకి ప్రవేశిస్తాయి. గ్రహాల అధిపతి అయిన సూర్యుడు కూడా జూలై 16న తన రాశిచక్రాన్ని మార్చి కర్కాటక రాశి ప్రవేశం చేయబోతున్నాడు. దీనినే కర్క సంక్రాంతి అంటారు. దీని కారణంగా కొందరి జీవితాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. సూర్యుడి యెుక్క ఈ రాశి మార్పు ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
వృశ్చిక రాశి
కర్క సంక్రాంతి వృశ్చిక రాశి వారికి మీకు మేలు చేస్తుంది. సూర్యుడి రాశి మార్పు కారణంగా ఈ రాశి వారి అదృష్టం మారబోతుంది. జూలైలో మీ సుడి తిరిగి ధనవంతులు కానున్నారు. కుటుంబ సభ్యుల సపోర్టుతో మీరు ఎలాంటి కార్యన్నైనా సులభంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీరు ఆర్థికంగా మంచి పొజిషన్ కు వెళతారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. పూర్వీకుల ఆస్తులు కలిసి వస్తాయి. మీరు భారీగా ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
కన్య రాశి
కర్కాటక రాశిలోకి సూర్యుడి సంచారం కన్యారాశి వారికి ఎంతో లాభదాయకంగా ఉండబోతోంది. జూలైలో మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. అదృష్టం వెన్నంటే ఉండి మీరు మీ పనిలో విజయం సాధించేలా చేస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది. ఒంటరిగా ఉన్న వ్యక్తులకు పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. ప్రేమికుల మధ్య ప్రేమ మరింత గాఢమవుతుంది. ఉద్యోగులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ కెరీర్ లో ఉన్న అడ్డంకులన్నీ తొలగి..మీరు మరింత వృద్ధి చెందుతారు. ఇతరులతో మీ పరిచయాలు పెరుగుతాయి.
తులారాశి
సూర్యుడి సంచార ప్రభావం తులారాశి వారికి సానుకూలంగా ఉంటుంది. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీకు సమాజంలో ప్రజాదరణ పెరుగుతుంది. మీ ఇంట్లో శుభకార్యం జరిగే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మీకు అనుకూలిస్తాయి. మీరు మానసిక ఒత్తిడిని బయటపడతారు. మీ ఆర్థిక పరిస్థితి ఉన్నతంగా ఉంటుంది. దాంపత్య జీవితం అద్భుతంగా ఉండబోతోంది. మీకు లక్ కలిసి వస్తుంది. రుణ భారం నుండి విముక్తి పొందుతారు.