HomeదైవంChaturthi 2026: కొత్త ఏడాది తొలి చతుర్థి ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?

Chaturthi 2026: కొత్త ఏడాది తొలి చతుర్థి ఎంతో ప్రత్యేకం.. ఎందుకో తెలుసా?

Angarki Chaturthi 2026: హిందూ క్యాలెండర్ ప్రకారం, ప్రతి నెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్థిని సంకష్ట చతుర్థి అంటారు. అయితే, ఈ చతుర్థి మంగళవారం నాడు వస్తే దానిని అత్యంత పవిత్రమైన ‘అంగారక చతుర్థి’ (Angarki Chaturthi) గా పిలుస్తారు. దీనిని సకత్ చౌత్ అని కూడా అంటారు. 2026 సంవత్సరంలో తొలి చతుర్థి మంగళవారం రావడం భక్తులకు ఎంతో విశేషమైనది.

- Advertisement -

తేదీ, శుభ ముహూర్తం
అంగారక చతుర్థి తేదీ: 6 జనవరి 2026, మంగళవారం.
చతుర్థి తిథి ప్రారంభం: 6 జనవరి 2026, ఉదయం 08:02 గంటలకు.
చతుర్థి తిథి ముగింపు: 7 జనవరి 2026, ఉదయం 06:53 గంటలకు.
చంద్రోదయ సమయం: రాత్రి 08:54 గంటలకు (స్థానిక సమయాన్ని బట్టి స్వల్ప మార్పులు ఉండవచ్చు).

అంగారక చతుర్థి విశిష్టత
‘సంకష్ట’ అంటే కష్టాల నుండి విముక్తి అని అర్థం. పురాణాల ప్రకారం, అంగారకుడు (కుజుడు) వినాయకుడి కోసం కఠినమైన తపస్సు చేసి ఆయన అనుగ్రహం పొందాడు. అందుకే మంగళవారం వచ్చే చతుర్థికి అంతటి ప్రాముఖ్యత ఏర్పడింది. ఏడాది పొడవునా చేసే సంకష్ట చతుర్థి వ్రతాల ఫలితం ఈ ఒక్క రోజు వ్రతం ఆచరించడం వల్ల లభిస్తుందని నమ్మకం. జాతకంలో మంగళ దోషం ఉన్నవారు, అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున గణపతిని పూజిస్తే శుభం కలుగుతుంది.

Also Read: Lunar Eclipse 2026 – కొత్త ఏడాదిలో రెండు చంద్రగ్రహణాలు.. ఇవి మనదేశంలో కనిపిస్తాయా!

పూజా విధానం
చతుర్థి రోజున ఉదయాన్నే నిద్రలేచి స్నానమాచరించి, ఎరుపు రంగు దుస్తులు ధరించండి. అనంతరం వినాయకుడి విగ్రహాన్ని లేదా పటాన్ని శుభ్రం చేసి, సింధూరంతో తిలకం దిద్దాలి. గణపతికి ఇష్టమైన గరిక గడ్డి, ఎర్రటి పువ్వులు సమర్పించాలి. మోదకాలు లేదా లడ్డూలను నైవేద్యంగా పెట్టాలి. రోజంతా ‘ఓం గం గణపతయే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి.అంగారక చతుర్థి రోజున వినాయక వ్రత కథను చదవడం లేదా వినడం వల్ల తలపెట్టిన కార్యాల్లో ఆటంకాలు తొలగి, సుఖశాంతులు చేకూరుతాయి. రోజంతా ఉపవాసం ఉండి, సాయంత్రం చంద్ర దర్శనం చేసుకుని, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తర్వాతే వ్రతాన్ని విరమించాలి.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News