Pradosh vrat December 2025: హిందూ మతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఏడాదిలో 24 ప్రదోష ఉపవాసాలు వస్తాయి. ప్రతి నెలా కృష్ణపక్షంలోని త్రయోదశి తిథి నాడు మరియు శుక్ల పక్షంలోని త్రయోదశి నాడు ఈ ప్రదోష వ్రతాలను ఆచరిస్తారు. ఈ ప్రదోష కాలంలో పార్వతీపరమేశ్వరులను ప్రత్యేకంగా పూజిస్తారు. డిసెంబర్ నెలలో తొలి ప్రదోష వ్రతం రాబోతుంది. పైగా అదే రోజు రవి మరియు సర్వార్థ సిద్ధి యోగాలు కూడా సంభవించబోతున్నాయి. దీంతో ఈ రోజుకు మరింత ప్రత్యేకత పెరిగింది. రాబోయే నెలలో భౌమ ప్రదోష వ్రతం ఏరోజున రాబోతుంది, శుభ గడియలు, దాని యెుక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం.
భౌమ ప్రదోష వ్రత తిథి, శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, మార్గశిర మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి డిసెంబర్ 02న మధ్యాహ్నం 3 58 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 03న మధ్యాహ్నం 12 24 గంటలకు ముగుస్తుంది. దీంతో భౌమ ప్రదోష వ్రతాన్ని డిసెంబర్ 02న జరుపుకోనున్నారు. ప్రదోష సమయంలో భోలాశంకరుడితోపాటు పార్వతీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. పూజ చేసుకోవడానికి శుభ ముహూర్తం సాయంత్రం 5 32 నుండి రాత్రి 8 16 గంటలకు వరకు ఉంటుంది.
వ్రత ప్రాముఖ్యత
సాధారణంగా భౌమ ప్రదోష వ్రతం మంగళవారం నాడు వస్తుంది. ఈ ఉపవాసం ఆచరించడం వల్ల శివపార్వతుల అనుగ్రహంతోపాటు హనుమంతుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఈ ప్రదోష వ్రతాన్ని చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోవడంతోపాటు కోరికలన్నీ సిద్దిస్తాయి. దీర్ఘకాలిక వ్యాధులు దూరమవడంతోపాటు దీర్ఘాయుష్టు కూడా లభిస్తుంది. ఈ సమయంలో నందీశ్వరుడిని కూడా పూజించడం వల్ల కూడా ఆ శివుడి కృపకు పాత్రులవుతారు.
శుభ యోగం
డిసెంబర్ నెలలో వచ్చే మెుదటి ప్రదోష ఉపవాసం నాడు మూడు అరుదైన యోగాలు ఏర్పడుతున్నాయి. పైగా ఇదే సమయంలో అశ్వినీ నక్షత్రాల కలయిక కూడా ఉంది. ఈ యోగాల సమయంలో శివపార్వతులను పూజించడం వల్ల మీ జీవితంలో ఆనందంతోపాటు శ్రేయస్సు కూడా ఉంటుంది. అంతేకాకుండా మీరు అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారు.
Also Read: Mercury Transit – డిసెంబరులో బుధుడు అద్భుతం.. వీరికి పండగే..
శుభ ఘడియలు
క్యాలెండర్ ప్రకారం, ఈరోజున సూర్యోదయం ఉదయం 06 59కు, సూర్యాస్తమయం సాయంత్రం 05 33 గంటలకు జరుగుతుంది. బ్రహ్మ ముహూర్తం ఉదయం 05 12 నుండి 06 06 వరకు ఉంటుంది. మధ్యాహ్నం 02 02 నుండి 03 17 వరకు విజయ ముహూర్తం ఉంటుంది. సంధ్యా కాలం సాయంత్రం 06 25 నుండి తెల్లవారుజామున 02 44 వరకు, నిశిత కాలం రాత్రి 11 50 నుండి 12 44 వరకు ఉంటుంది.

