HomeదైవంBhogi 2026: కొత్త ఏడాదిలో భోగి పండుగ ఎప్పుడు?

Bhogi 2026: కొత్త ఏడాదిలో భోగి పండుగ ఎప్పుడు?

- Advertisement -

Bhogi 2026 date and Significance in Telugu: తెలుగు వారు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో మకర సంక్రాంతి ప్రధానమైనది. మూడు రోజుల పాటు జరిగే ఈ సంబరాల్లో మొదటి రోజును ‘భోగి’ గా పిలుస్తారు. దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు వచ్చే ఈ పండుగ మన సంస్కృతికి ప్రతీక. ఉత్తరాయణం మెుదలయ్యే ముందు రోజు చలి విపరీతంగా ఉంటుంది, దానిని తట్టుకునేందుకు భగ భగ మండే చలి మంటలు అందరూ వేయడం వల్ల దీనికి భోగి అని పేరు వచ్చింది. ఈరోజుతోనే ధనుర్మాసం పూర్తవుతుంది. అలాంటి భోగి పండుగ కొత్త సంవత్సరంలో ఎప్పుడు వచ్చింది, దాని ఆధాత్మిక ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

2026లో భోగి పండుగ ఎప్పుడు?

హిందూ పంచాంగం ప్రకారం, 2026 సంవత్సరంలో భోగి పండుగ జనవరి 13, మంగళవారం నాడు వస్తుంది. మరుసటి రోజు జనవరి 14న సంక్రాంతి, 15న కనుమ పండుగను జరుపుకుంటారు. భోగి పండుగను పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో లోహ్రీ అని, అస్సాంలో మాఘ్ బిహూ లేదా భోగాలీ బిహు అని, రాజస్థాన్ మరియు గుజరాత్ రాష్ట్రాల్లో ఉత్తరాయణ్ అని, తమిళనాడులో భోగి పండిగై అని పిలుస్తారు.

Also Read: Ratha Saptami -2026లో రథ సప్తమి ఎప్పుడు? పండుగ విశిష్టత తెలుసా?

భోగి పండుగ విశిష్టత:

భోగి మంటలు: భోగి రోజు తెల్లవారుజామునే ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను, పనికిరాని చెత్తను మంటల్లో వేయడం ద్వారా మనలోని చెడు ఆలోచనలను వదిలివేసి, కొత్త వెలుగులకు స్వాగతం పలకాలని దీని అర్థం. అంతేకాకుండా ఆ మంటల సెగతో కాచుకున్న వేడినీటితో తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు.

భోగి పళ్లు: సాయంత్రం వేళ ఐదేళ్ల లోపు చిన్న పిల్లలకు రేగు పళ్లు, చిల్లర నాణేలు, పూలతో కలిపి ‘భోగి పళ్లు‘ గా తలపై పోస్తారు. దీనివల్ల పిల్లలకు దిష్టి తగలకుండా, ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్మకం.

ముగ్గులు మరియు గొబ్బెమ్మలు: ఆడపడుచులు ఇళ్లను అందమైన ముగ్గులతో, గొబ్బెమ్మలతో అలంకరిస్తారు. హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల ఆటలతో ఊరంతా కోలాహలంగా మారుతుంది. గోదావరి జిల్లాల్లో కోడి పందాలు జోరుగా జరుగుతాయి.

Also Read: Sankranti 2026 Special – సంక్రాంతి రోజున తప్పక రుచి చూడాల్సిన వంటకాలివే!

ఆధ్యాత్మిక ప్రాముఖ్యత:

పురాణాల ప్రకారం, గోదాదేవి (ఆండాళ్) రంగనాథుడిని వివాహం చేసుకోవడానికి చేసిన వ్రతం భోగి రోజే పూర్తయిందని చెబుతారు. అందుకే ఈ రోజును భోగ భాగ్యాలను ప్రసాదించే రోజని అంటారు.

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News