Dev Uthani Ekadashi 2025 date: హిందువులకు కార్తీక మాసం చాలా పవిత్రమైనది. ఈ మాసం ఈసంవత్సరం అక్టోబర్ 22 నుంచి నవంబరు 20 వరకు ఉండనుంది. కార్తీకం పరమశివుడికి ఎంతో ఇష్టమైన మాసం. అలాంటి ఈ నెలలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే ఉత్థాన ఏకాదశి అంటారు. దీనినే దేవుత్థాని ఏకాదశి లేదా దేవుత్తని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజున శ్రీమహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు. ఈరోజున శ్రీహరిని పూజించిన వారి కోరికలు నెరవేరుతాయని పురాణ కథనం. ఈ పర్వదినాన మీ ఇంటిలో చందన దీపాన్ని వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు.
దేవ ఉథాని ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, కార్తీక మాసంలోని శుక్ల పక్ష ఏకాదశి తిథి నవంబర్ 01 ఉదయం 09:11 గంటలకు ప్రారంభమై.. నవంబర్ 02 ఉదయం 07:31 గంటలకు ముగుస్తుంది. సామాన్య ప్రజలు దేవుత్థాని ఏకాదశిని నవంబర్ 01న జరుపుకుంటే.. వైష్ణవ భక్తులు నవంబర్ 02న ఉపవాసం ఉంటారు.
సూర్యోదయం – ఉదయం 6:33 గంటలకు
సూర్యాస్తమయం – సాయంత్రం 05:36 గంటలకు
చంద్రోదయం – మధ్యాహ్నం 02:49 గంటలకు
చంద్రాస్తమయం – అర్థరాత్రి 02:46 గంటలకు
బ్రహ్మ ముహూర్తం – ఉదయం 04:50 నుండి ఉదయం 05:41 గంటలకు
విజయ ముహూర్తం – మధ్యాహ్నం 01:55 నుండి మధ్యాహ్నం 02:39 గంటలకు
సంధ్యా సమయం – సాయంత్రం 05:36 నుండి సాయంత్రం 06:02 గంటలకు
నిషిత ముహూర్తం – రాత్రి 11:39 నుండి ఉదయం 12:31 గంటలకు
Also Read: Nagula Chavithi 2025-ఈ ఏడాది నాగుల చవితి ఎప్పుడు? పుట్టలో ఏ టైంలో పాలు పోయాలి?
దేవ ఉథాని ఏకాదశి ప్రాముఖ్యత
దేవ్ ఉథాని ఏకాదశి నుండే శుభకార్యాలు మెుదలవుతాయి. దేవ్ ఉథాని అంటే అర్థం దేవుడు మేల్కొనడం. ఆషాఢ మాసం శుద్ధ ఏకాదశి రోజున యోగ నిద్రలోకి వెళ్లిన శ్రీ మహా విష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక మాసం శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఈ నాలుగు నెలల కాలాన్నే చాతుర్మాసం అంటారు. దేవ్ ఉథాని ఏకాదశి నాడు శ్రీహరిని పూజించడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు.


