Govardhan Puja 2025 date and time: అక్టోబరు నెల పండుగలకు, వ్రతాలు, ఉపవాసాలకు పెట్టింది పేరు. ఆధ్యాత్మిక పరంగా ఈ మాసం ఎంతో శుభప్రదమైనది. దీపావళి తర్వాత జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగలలో గోవర్ధన పూజ ఒకటి. గోకుల వాసులను కాపాడటానికి శ్రీకృష్ణుడు గోవర్దన పర్వతాన్ని చిటికెన వేలుతో పైకెత్తుతాడు. అప్పటి నుండే ఆయనను గోవర్దనధారి అని పిలుస్తున్నారు. అప్పటి నుండి ఈ పర్వాతానికి అన్నకూట్ లేదా ఆహార పర్వతం అనే పేరు వచ్చింది. హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలో శుక్లపక్షం మెుదటి రోజున గోవర్ధన పూజ జరుపుకుంటారు. పైగా ఆ రోజు విక్రమ్ సంవత్ క్యాలెండర్ తొలి రోజు కూడా. ఈ సంవత్సరం గోవర్ధన పూజ బుధవారం, అక్టోబర్ 22న జరుపుకోనున్నారు. ఈరోజున శ్రీకృష్ణ పరమాత్మను 56 రకాల ఆహార పదార్థాలతో పూజిస్తారు.
గోవర్ధన పూజ తేదీ, శుభ ముహూర్తం
గోవర్ధన పూజ తేదీ – బుధవారం, 22 అక్టోబర్ 2025
ప్రాతఃకాల ముహూర్తం (ఉదయం) – 06:26 నుండి 08:42 వరకు (2 గంటల 16 నిమిషాలు)
సాయంకాల ముహూర్తం (సాయంత్రం) – మధ్యాహ్నం 03:29 నుండి 05:44 (2 గంటల 16 నిమిషాలు)
ప్రతిపాద తిథి ప్రారంభం – 21 అక్టోబర్ 2025, సాయంత్రం 05:54
ప్రతిపాద తిథి ముగింపు – 22 అక్టోబర్ 2025, రాత్రి 08:16
Also read: Karthika Masam 2025 -కార్తీక మాసంలో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?
గోవర్ధన పూజ ఆచారాలు
ఈరోజున భక్తులు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. అనంతరం పూజా గదిని శుభ్రం చేయాలి. అప్పుడు శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి విగ్రహాలను ప్రతిష్టించి పాలతో స్నానం చేయించాలి. తర్వాత పూల మాలతో అలంకరించాలి. పువ్వులు, పండ్లు, స్వీట్స్ నైవేద్యంగా సమర్పించాలి. కొన్ని చోట్ల గోవర్ధన పర్వతాన్ని కూడా పూజిస్తారు. ముఖ్యంగా ఈ పండుగను ఉత్తర భారతదేశ ప్రజలు జరుపుకుంటారు. మధుర, బృందావనంలో దేవాలయాల్లో భజనలు, కీర్తనలు పాడతారు. మరికొన్ని ప్రాంతాల్లో ఇంద్రుడు మరియు విశ్వకర్మను కూడా పూజిస్తారు. చివరగా హారతినిచ్చి..ప్రసాదాన్ని పంచి పూజను ముగిస్తారు.

