Hartalika Teej Vrat 2025 Date: హిందువుల ముఖ్యమైన పండుగల్లో హర్తాలికా తీజ్ ఒకటి. శివుడు లాంటి భర్త దొరకాలని పెళ్లికాని అమ్మాయిలు, నూరేళ్లు సౌభాగ్యంతో ఉండాలని వివాహితులు ఈ పండుగను జరుపుకుంటారు. ఈ వ్రత ఆచరణ చాలా కష్టం. ఎందుకంటే ఒక్క చుక్క మంచి నీరు తాగకుండా.. ఉపవాసం ఉంటూ భక్తితో శివపార్వతులను ఆరాధించాలి. అంతేకాకుండా ఒక్కసారి మెుదలుపెడితే మధ్యలో అపకూడదట. ఈరోజున రాత్రంతా జాగరణ చేస్తూ శివనామస్మరణ చేస్తూ ఉంటారు. వైవాహిక సమస్యలు ఉన్నవారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మేలు జరుగుతుంది. మరి ఈ హర్తాలికా తీజ్ ఎప్పుడు, శుభ సమయం ఏంటో తెలుసుకుందాం.
హర్తాలికా తీజ్ తేదీ, సమయం
2025లో హర్తాలిక తీజ్ భాద్రపద మాసంలో శుక్ల పక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. ఈ తిథి 25 ఆగస్టు 2025న మధ్యాహ్నం 12:34 గంటలకు ప్రారంభమై.. 26 ఆగస్టు 2025న మధ్యాహ్నం 1:54 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయ తిథి ఆధారంగా వ్రతం ఆచరిస్తారు కాబట్టి హర్తాలిక తీజ్ 26 ఆగస్టు 2025న జరుపుకుంటారు. దీని తర్వాత రోజునే వినాయక చవితిని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో జరుపుకుంటారు.
హర్తాలికా తీజ్ వ్రత విశిష్టత
ఈ వ్రతాన్ని శివపార్వతులు ప్రేమకథకు ప్రతీకగా జరుపుకుంటారు. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడానికి ఎన్నో వేల సంవత్సరాలు ఉపవాసం ఉండి కఠోర తపస్సు చేసినట్లు చెబుతారు. అందుకే వివాహితులు వివాహ బంధంలో ఏవైనా సమస్యలు ఉంటే తొలగిపోవడానికి, పెళ్లికాని యువతులు మంచి జీవిత భాగస్వామి దొరకాలని ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. దీనినే నిర్జల వ్రతం అని కూడా పిలుస్తారు. హర్తాళికా తీజ్ సమయంలో స్త్రీలకు పీరియడ్స్ వస్తే..ఆ స్త్రీలు దూరం నుండి భగవంతుని కథను వినాలి. ఈ రోజున దేవుడిని తాకకూడదు.
Also Read: Venus Transit 2025 – త్వరలో కేతు-శుక్రల కలయిక.. ఈ 3 రాశుల తలరాత మారబోతుంది ఇక..


