Indira Ekadashi 2025 Date and Significance: హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశుల్లో ఇందిరా ఏకాదశికి చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా అశ్వినీ మాసం శుక్ల పక్ష ఏకాదశి రోజున దీనిని జరుపుకుంటారు. ఈరోజున శ్రీమన్నారాయణుడిని పూజించడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందడంతోపాటు పూర్వీకుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. అంతేకాకుండా మీకు మరణానంతరం మోక్షం లభిస్తుంది. అయితే ఈ ఏకాదశి పితృపక్ష సమయంలో రావడం వల్ల దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సంవత్సరం ఇందిరా ఏకాదశి ఎప్పుడు వచ్చింది, శుభ ముహూర్తం తదితర విషయాలు తెలుసుకుందాం.
తేదీ, శుభ సమయం
పంచాంగం ప్రకారం, అశ్వినీ మాసం కృష్ణ పక్ష ఏకాదశి తిథి సెప్టెంబర్ 17న తెల్లవారుజామున 12:21 గంటలకు ప్రారంభమై.. అదే రోజు రాత్రి 11:39 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం, ఇందిరా ఏకాదశి వ్రతాన్ని సెప్టెంబర్ 17న జరుపుకోనున్నారు. ఈరోజున బ్రహ్మ ముహూర్తం ఉదయం 4 33 నుండి 5 20 గంటల వరకు ఉంటుంది. ఈ ఏకాదశినే శ్రద్ధా ఏకాదశి అని కూడా పిలుస్తారు.
Also Read: Ganesh Nimajjanam-గణపయ్య నిమజ్జనం సమయంలో ఈ తప్పులు చేస్తే.. మీరు కష్టాలు కొని తెచ్చుకున్నట్లే..!
పూజా విధానం
=>ఇందిరా ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్రలేచి, స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి.
=> ఇంటి పూజ గదిని గంగాజలంతో శుభ్రం చేసి, ఉపవాస దీక్షను తీసుకోండి.
=> అనంతరం ఒక పీఠంను పెట్టి దానిపై పసుపు వస్త్రాన్ని పరచి విష్ణువు విగ్రహం లేదా ఫోటోను పెట్టండి.
=> ఇప్పుడు విష్ణువుకు పంచామృతంతో అభిషేకం చేయించండి. తర్వాత పసుపు పువ్వులు, తులసి ఆకులు, ధూపం, దీపం మరియు నైవేద్యం సమర్పించండి.
=> ఆ తర్వాత విష్ణువు మంత్రాలను జపించడంతోపాటు విష్ణువు పారాయణం చేయండి.
=> చివరగా విష్ణువు ముందు నెయ్యి దీపం వెలిగించి హారతి ఇవ్వండి.


