Krishna Janmashtami 2025 Date and Puja Timings: హిందువుల ప్రధాన పండుగలలో జన్మాష్టమి ఒకటి. శ్రీ కృష్ణుడికి పుట్టిన రోజు సందర్భంగా ఈ వేడుకను జరుపుకుంటారు. రాబోయేది శ్రీ కృష్ణుడి 5252వ జన్మదినం. కావున దేశం మెుత్తం ఈ బాల గోపాలుడి జన్మాష్టమిని ఘనంగా జరిపేందుకు సిద్ధమవుతోంది.
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి ఏటా శ్రావణ మాసం కృష్ణ పక్షం అష్టమి తిథి నాడు శ్రీ కృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటారు. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో శ్రీకృష్ణ అవతారం ఎనిమిదోది. ఈ జన్మాష్టమినే ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. దీనికి కృష్ణ జన్మాష్టమి, గోకులాష్టమి, కృ,ష్ణాష్టమి వంటి పేర్లు ఉన్నాయి. ఈ రోజున వాసుదేవుడిని నిషిత కాలంలో పూజిస్తారు. ఈ సంవత్సరం ఈ జన్మాష్టమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.
జన్మాష్టమి ఎప్పుడు?
అష్టమి తిథి ప్రారంభం: ఆగస్టు 15, 2025 – 11:49 PM
అష్టమి తిథి ముగింపు: ఆగస్టు 16, 2025 – 09:34 PM
రోహిణి నక్షత్రం ప్రారంభం: ఆగస్టు 17, 2025 – 04:38 AM
రోహిణి నక్షత్రం ముగింపు: ఆగష్టు 18, 2025 – 03:17 AM
జన్మాష్టమి ప్రాముఖ్యత
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కృష్ణ భక్తులు ఈ రోజు ఎంతో ప్రత్యేకం. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచరిస్తూ.. వాసుదేవుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అంతేకాకుండా ఇంట్లో బాలకృష్ణుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయాలి. అంతేకాకుండా ఈరోజున ఆయన విశ్వ మానావళికి అందించిన భగవద్గీతను పారాయణం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు.
మంత్రం
అచ్యుతం కేశ్వం కృష్ణ దామోదరం రామ్ నారాయణం జంకీ వల్లభం..!!
Also Read: Raksha Bandhan 2025 – రాఖీ పండుగ నాడు ఈ గిఫ్ట్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకండి!
Disclaimer : ఇక్కడ ఇవ్వబడిన కథనం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా దీనిని ఇవ్వడమైనది. ఈ వార్తకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.


