Jivitputrika Vratam 2025 Date: హిందూ మతంలో ప్రతి పండుగ మరియు వ్రతానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కోవకు చెందినదే జీవిత పుత్రిక వ్రతం. ఈ ఉపవాసాన్ని ఉత్తర భారతదేశంలో ఆచరిస్తారు. ముఖ్యంగా దీనిని బీహార్, జార్ఖండ్ మరియు ఉత్తరప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో జరుపుకుంటారు.
జీవిత పుత్రిక వ్రతాన్ని ప్రతి ఏటా అశ్వినీ మాసంలో కృష్ణపక్ష అష్టమి తిథి నాడు జరుపుకుంటారు. దీనినే జితియా లేదా జియుతియా వ్రతం అని కూడా పిలుస్తారు. తల్లులు తమ పిల్లల దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, మరియు శ్రేయస్సు కోసం ఆచరిస్తారు. ఈరోజున వివాహిత స్త్రీలు నీరు కూడా ముట్టుకోకుండా కఠిన ఉపవాసం ఉంటూ జీమూతవాహనుడిని పూజిస్తారు. జీవిత పుత్రిక వ్రతం తేదీ, శుభ ముహూర్తం తదితర విషయాలు తెలుసుకుందాం.
జీవిత పుత్రిక వ్రతం ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్వయుజ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 14 ఉదయం 5:04 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 15 తెల్లవారుజామున 3:06 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా జీవిత పుత్రిక వ్రతాన్ని సెప్టెంబరు 14న జరుపుకోనున్నారు.
వ్రత ప్రాముఖ్యత
హిందూ పురాణాల ప్రకారం, జీవిత పుత్రిక వ్రతం నాడు జీమూతవాహనుడిని పూజిస్తారు. తల్లులు అత్యంత భక్తితో కఠినమైన ఉపవాసాన్ని ఆచరించడం వల్ల ఆ దేవుడు ఆశీస్సులు తమ పిల్లలను అన్ని అపాయాలను నుండి రక్షిస్తాడు. అంతేకాకుండా వారికి దీర్ఘాయుష్షుతోపాటు ఆరోగ్యకరమైన మరియు సంపన్నమైన జీవితాన్నిప్రసాదించనున్నాడు.
Also Read: Diwali 2025-ఈ ఏడాది దీపావళి ఎప్పుడు? అక్కడ ఐదు రోజులు ఎందుకు జరుపుతారు?
పూజ విధానం
జీవిత పుత్రిక వ్రతం రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఉపవాస దీక్షను తీసుకుని సూర్యదేవుడికి నీటితో అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఆ తర్వాత గంగా జలంతో ఇంటిలోని పూజా మందిరాన్ని శుద్ది చేయాలి. ఏదైనా పీఠంపై శుభ్రమైన వస్త్రాన్ని పరిచి జీమూత వాహనుడి విగ్రహం లేదా ప్రతిమను ప్రతిష్టించాలి. అనంతరం ఆ దేవుడు ముందు నెయ్యి దీపం వెలిగించాలి. జీవిత పుత్రిక వ్రత కథను పఠించడంతోపాటు మంత్రాలను కూడా జపించాలి. పండ్లు, స్వీట్లను నైవేద్యంగా పెట్టి.. హారతి పట్టాలి. చివరగా మీ శక్తి కొలదీ పేదవారికి బట్టలు లేదా దుస్తులు దానం చేయండి.
Also Read:Sun Transit 2025 -సూర్యుడి రాకతో ఈ 4 రాశులకు జాక్ పాట్.. ఇందులో మీది ఉందా?


