Saturday, November 15, 2025
HomeదైవంKarthika Pournami 2025: ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఏ సమయంలో నదీ స్నానం...

Karthika Pournami 2025: ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు? ఏ సమయంలో నదీ స్నానం చేయాలి?

Karthika Pournami 2025 Date and Time: హిందువులకు పవిత్రమైన మాసం కార్తీక మాసం. ఈ నెలలో పరమ శివుడిని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఈ మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి చాలా విశిష్టమైనది. ఈరోజున ఆలయాలన్నీ శివనామస్మరణతో మార్మోగిపోతాయి. పౌర్ణమి నాడు చేసే నదీ స్నానానికి, దానానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం కార్తీక పౌర్ణమి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో నదీ స్నానం చేయాలి, పూజా విధానం ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

కార్తీక పౌర్ణమి ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక పౌర్ణమి తిథి నవంబర్ 4 రాత్రి 10:30కి మొదలై.. నవంబర్ 5 సాయంత్రం 6:48 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, నవంబర్ 5నే కార్తీక పౌర్ణమి జరుపుకుంటారు. ఈరోజున నదీ స్నానం చేసి, దీపాలు వెలిగించడం వల్ల పాపాలన్నీ తొలగిపోతాయి.

నదీ స్నానం ఎప్పుడు చేయాలి?
కార్తీక పౌర్ణమి పర్వదినాన నదీ స్నానం చేయాలనుకునేవారు నవంబర్ 5 ఉదయం 4:52 నుంచి ఉదయం 5:44 వరకు చేస్తే మంచిది. శివుడిని ఆరాధించడానికి ఉదయం 7:58 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు శుభప్రదంగా ఉంటుంది. సాయంత్రం దీపారాధన చేయడానికి మంచి సమయం సాయంత్రం 5:15 నుంచి 7:05 వరకు ఉంటుంది.

Also Read: Mangal Gochar 2025 – వృశ్చిక రాశిలో బుధుడు-కుజుడు కలయిక.. ఈ 3 రాశులకు సుడి తిరగబోతుంది ఇక..

కార్తీక పౌర్ణమి ప్రాముఖ్యత
కార్తీక పౌర్ణమి నాడు పరమేశ్వరుడిని పూజించడంతోపాటు 365 వత్తులు వెలిగించడం శుభప్రదంగా భావిస్తారు. ఏడాదిలో ఎప్పుడూ దీపం పెట్టనివారు ఈరోజు దీపారాధన చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం లభించడంతోపాటు నిండు నూరేళ్లు అష్టఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో ఉంటారని నమ్ముతారు. పౌర్ణమి నాడు ఉసిరి కాయలో నెయ్యి వేసి సాయంత్రం దీపారాధన చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని భక్తులు విశ్వాసం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad