Magha Purnima 2026: హిందూ క్యాలెండర్ ప్రకారం, మాఘ మాసంలో వచ్చే పౌర్ణమిని ‘మాఘ పౌర్ణమి’ లేదా ‘మాఘీ పూర్ణిమ’ అని కూడా పిలుస్తారు. ఈ పౌర్ణమి శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. 2026లో ఈ పర్వదినం ఫిబ్రవరి 1, ఆదివారం నాడు వస్తోంది. ఈ రోజున పవిత్ర నదులలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం.
పౌర్ణమి స్నానం ఎప్పుడు చేయాలి?
పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1, 2026 ఉదయం 05:52 గంటలకు ప్రారంభమై..ఫిబ్రవరి 2, 2026 తెల్లవారుజామున 03:38 గంటలకు ముగుస్తుంది. ఫిబ్రవరి 1వ తేదీ రోజంతా పౌర్ణమి తిథి ఉండటంతో, ఆ రోజే స్నాన దానాదులు నిర్వహించుకోవడం శ్రేయస్కరం.
మాఘ స్నానం విశిష్టత
పురాణాల ప్రకారం, మాఘ పౌర్ణమి నాడు దేవతలందరూ భూమిపైకి దిగివచ్చి ప్రయాగ (అలహాబాద్) లోని గంగా నదిలో స్నానం చేస్తారు. అందుకే ఈ రోజున గంగా స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని, అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం లభిస్తుందని చెబుతారు. ఒకవేళ నదికి వెళ్లడం వీలుకాకపోతే, ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు.
Also Read: Magha Masam 2026 -మాఘ మాసం ఎప్పటి నుంచంటే?
మాఘ పౌర్ణమి ప్రాముఖ్యత
ఈ రోజున శ్రీమహావిష్ణువును పూజించి, సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఈ పవిత్రమైన రోజున పార్వతీమాతను పూజిస్తే మీ ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. అంతేకాకుండా పెళ్లికాని వారికి త్వరలోనే వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఈరోజున గురు గ్రహాన్ని పూజించడం వల్ల మీ జాతకంలో గురు దోషం తొలగిపోతుందని పెద్దలు చెబుతారు. అలాగే నువ్వులు, అన్నం మరియు వస్త్రాలను దానం చేయడం వల్ల పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయని పండితులు పేర్కొంటున్నారు.
Also Read: Shiva Third Eye -శివుడికి మూడో కన్ను ఎలా వచ్చింది? అది తెరిస్తే ఏమవుతుంది?

