Margashira Amavasya 2025 date and time: హిందూ క్యాలెండర్ ప్రకారం, సంవత్సరంలో మెుత్తం 12 అమావాస్యలు, 12 పౌర్ణమిలు ఉంటాయి. ప్రస్తుతం మార్గశిర మాసం నడుస్తోంది. ఈ నెలలో వచ్చే అమావాస్యనే మార్గశిర అమావాస్య అంటారు. ఈ రోజున శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా పూజిస్తారు. శ్రీహరిని పూజించడం వల్ల మీ సంపద వృద్ధి చెందడమే కాకుండా మీ జీవితంలోసుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. ఈరోజున చనిపోయిన పూర్వీకులకు తర్పణం వదలడంతోపాటు శ్రాద్ధకర్మలు చేస్తారు. దీని వల్ల పూర్వీకులు సంతోషించి ఆశీర్వాదాలు అందిస్తారు. మార్గశిర అమావాస్య తేదీ, శుభ సమయం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం.
మార్గశిర అమావాస్య తేదీ, శుభ ముహూర్తం
ఈ సంవత్సరం మార్గశిర అమావాస్య తిథి నవంబర్ 19న ఉదయం 9 గంటల 43 నిమిషాలకు మెుదలై.. తర్వాత రోజు నవంబర్ 20 మధ్యాహ్నం 12 గంటల 16 నిమిషాలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా, మార్గశిర అమావాస్యను నవంబర్ 20, గురువారం జరుపుకోనున్నారు. ఆరోజున సూర్యోదయం ఉదయం 6 గంటల 48 నిమిషాలకు ఉంటుంది. పూర్వీకుల పూజ సమయం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ఉంటుంది. శ్రీమహావిష్ణువును పూజించడానికి ఆరాధించడానికి శుభ సమయం ఉదయం 5: 01 నుండి 5:54 వరకు ఉంటుంది. రాహు కాలం మధ్యాహ్నం 1: 26 నుండి 2:46 వరకు ఉంటుంది.
పూజా విధానం
మార్గశిర అమావాస్య నాడు ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేయడం పవిత్రమైనదిగా భావిస్తారు. ఈరోజున సూర్యభగవానుడికి నీరుతో అర్ఘ్యం సమర్పించడం శుభప్రదంగా భావిస్తారు. అనంతరం మీ ఇంటి పూజ గదిలో ఓ పీఠాన్ని ఏర్పాటు చేసి దానిపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి దానిపై విష్ణుమూర్తి విగ్రహం లేదా చిత్రపటాన్ని ఏర్పాటు చేయండి. ఆ తర్వాత నారాయణుడి ముందు నెయ్యితో అఖండ దీపాన్ని వెలిగించింది. ఆ దేవుడికి పువ్వులు, పండ్లు, స్వీట్లు సమర్పించాలి. విష్ణు మంత్రాలను, చాలీసాను పఠించాలి. చివరగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈరోజున పూర్వీకులకు తర్పణాలు వదలడం వల్ల వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. మీ శక్తి కొలదీ పేదవారికి దానం చేయండి.
Also Read: Margashira Masam 2025 -మార్గశిర మాసంలో రాబోయే పండుగలు, వ్రతాలు ఏంటో తెలుసా?


