HomeదైవంMargasira Pournami 2025: మార్గశిర పౌర్ణమి ఎప్పుడు? ఈరోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు?

Margasira Pournami 2025: మార్గశిర పౌర్ణమి ఎప్పుడు? ఈరోజున లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు?

- Advertisement -

Margasira Pournami 2025 Date and timing: మార్గశిర మాసం మెుదలైంది. ఇది చాలా పవిత్రమైనది. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈరోజున స్నాన, దాన చేయడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. మార్గశిర పౌర్ణమి నాడు రాత్రిపూట లక్ష్మీదేవితోపాటు చంద్రుడిని పూజించడం వల్ల మీరు అనుకున్నది సిద్దిస్తుంది. ఇదే రోజు రవి యోగంతోపాటు భద్ర కాలం కూడా ఉంటుంది. ఈ ఏడాది మార్గశిర పౌర్ణమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం.

మార్గశిర పౌర్ణమి తేదీ, శుభ సమయం

పంచాంగం ప్రకారం, మార్గశిర పూర్ణిమ తిథి డిసెంబర్ 04, గురువారం ఉదయం 8: 37 గంటలకు ప్రారంభమై.. డిసెంబర్ 05, శుక్రవారం ఉదయం 04: 43 గంటలకు ముగుస్తుంది. సూర్యోదయం ఆధారంగా మార్గశిర పౌర్ణమిని డిసెంబర్ 04న జరుపుకుంటారు. ఇదే రోజు ఉదయం 6: 59 గంటల నుంచి మధ్యాహ్నం 2: 54 గంటల వరకు రవి యోగం ఉంటుంది. ఈ యోగంలో స్నాన దానం చేయడం వల్ల మీ పాపాలన్నీ తొలగిపోతాయి. ఉదయం 5:10 నుండి ఉదయం 6:04 వరకు బ్రహ్మ ముహూర్తం, ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:32 వరకు అభిజిత్ ముహూర్తం ఉంటుంది. నిషిత పూజ సమయం రాత్రి 11:45 నుండి 12:39 వరకు ఉంటుంది. పౌర్ణమి నాడు చంద్రోదయం సాయంత్రం 4: 35 గంటలకు జరుగుతుంది. మధ్యాహ్నం 1:29 నుంచి 2:48 వరకు రాహు కాలం ఉంటుంది. భద్ర కాలం ఉదయం 8:37 నుండి సాయంత్రం 6:40 గంటల వరకు ఉంటుంది.

Also Read: Ekadashi 2025- డిసెంబరులో అద్భుతం

పూజా విధానం

మార్గశిర పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తల స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి. ఇంటిలోని పూజా గదిని శుభ్రం చేసి విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, చంద్రుడు ఫోటోలను పెట్టి పూజించాలి. ప్రదోష కాలంలో లక్ష్మీదేవిని పూజించడం శుభప్రదంగా భావిస్తారు. ఆ జగన్మాతకు నెయ్యితో అఖండ దీపం వెలిగించి.. ధూప, నైవేద్యాలను సమర్పించాలి. లక్ష్మీదేవి మంత్రాలను ఉచ్ఛరిస్తూ ప్రార్థించాలి. చివరిగా హారతి ఇవ్వాలి. దీంతో మీకు ధనధాన్యాలకు లోటు ఉండదు. చంద్రోదయ వేళ చంద్రుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఇలా చేయడం మీ జాతకంలో ఉన్న చంద్ర దోషం తొలగిపోతుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News