Masik Kalashtami January 2026 Telugu: హిందూ ధర్మంలో అత్యంత శక్తివంతమైన దినాలలో మాస శివరాత్రి ఎంత విశేషమైనదో, పరమశివుని భీకర రూపమైన కాలభైరవుడిని ఆరాధించే మాస కాలభైరవాష్టమి కూడా అంతే ముఖ్యం. 2026 సంవత్సరం జనవరి నెలలో వచ్చే ఈ కాలభైరవాష్టమి ప్రాముఖ్యత, ముహూర్తం మరియు పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందా.
తేదీ మరియు సమయం
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు కాలభైరవాష్టమిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం తొలి కాల భైరవాష్టమి జనవరి 10, 2026 శనివారం నాడు వచ్చింది. అష్టమి తిథి జనవరి 10, ఉదయం 08:23 గంటలకు ప్రారంభమై.. జనవరి 11, ఉదయం 10:20 గంటలకు ముగుస్తుంది.
కాలభైరవాష్టమి విశిష్టత
కాలభైరవుడిని “కాలానికి అధిపతి” (God of Time) అని పిలుస్తారు. ఈ రోజున భైరవుడిని భక్తితో ఆరాధించడం వల్ల ఇంట్లో ఉన్న దుష్టశక్తులు, శత్రువుల నుండి రక్షణ లభిస్తుంది. జీవితంలో అపజయాలు, అనారోగ్యం లేదా మరేదైనా కారణం వల్ల కలిగే భయాల నుండి కాలభైరవుడు విముక్తి కలిగిస్తాడు. కాలభైరవ వ్రతాన్ని ఆచరించడం వల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధిస్తుంది.
Also Read: Mukkunuma 2026 – ఈ ఏడాది ముక్కనుమ పండుగ ఎప్పుడంటే?
పూజా విధానం
మాస కాలభైరవాష్టమి నాడు ఉదయాన్నే నిద్రలేచి పవిత్ర స్నానం ఆచరించాలి. రోజంతా ఉపవాసం ఉండాలని సంకల్పం తీసుకోవాలి. కాలభైరవుడికి సాయంత్రం సమయంలో పూజ చేయడం అత్యంత శ్రేయస్కరం. దగ్గరలోని భైరవ ఆలయాన్ని సందర్శించడం లేదా ఇంట్లోనే కాలభైరవుని పటం ముందు దీపం వెలిగించాలి.కాలభైరవుడికి బెల్లం లేదా ఇతర తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.కాలభైరవుడి వాహనం కుక్క. కాబట్టి, ఈ రోజున నల్ల కుక్కకు రొట్టెలు లేదా ఇతర ఆహారం తినిపించడం వల్ల బాబా భైరవుడు ప్రసన్నుడవుతాడు. ఈ రోజున మద్యం మరియు తామసిక ఆహారానికి (ఉల్లి, వెల్లుల్లి, మాంసం) పూర్తిగా దూరంగా ఉండాలి.

