Mukkunuma festival 2026 date and Significance in Telugu: సాధారణంగా సంక్రాంతి సంబరాల్లో భాగంగా భోగి, సంక్రాంతి, కనుమ తర్వాత వచ్చే నాలుగో రోజును ముక్కనుమగా జరుపుకుంటారు. ఈ పండుగ ఎప్పుడు తేదీ, విశిష్టత, దీని వెనుకున్న పురాణ కథ ఏంటో తెలుసుకుందా.
2026 సంక్రాంతి పండుగ వరుస క్రమం:
భోగి: జనవరి 14, 2026 (బుధవారం)
సంక్రాంతి (పెద్ద పండుగ): జనవరి 15, 2026 (గురువారం)
కనుమ: జనవరి 16, 2026 (శుక్రవారం)
ముక్కునుమ: జనవరి 17, 2026 (శనివారం)
పురాణ గాథ
పురాణాల ప్రకారం, ఇంద్రుడి గర్వాన్ని అణచడానికి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికెన వేలుతో ఎత్తి గోవులను, గోపాలురను రక్షించాడు. కనుమ రోజున పశువులను పూజిస్తే, ముక్కునుమ రోజున ఆ గోవర్ధన పర్వతాన్ని (ప్రకృతిని) పూజిస్తారు. ప్రకృతి మనకు ఆహారాన్ని, పశువులకు గ్రాసాన్ని ఇస్తున్నందుకు కృతజ్ఞతగా ఈ పండుగ జరుపుకుంటారు.
Also Read: Solar Eclipse 2026 -ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం భారత్‌లో కనిపిస్తుందా?
ముక్కునుమ విశిష్టత
భోగి నాడు ఎవరైతే గౌరీ దేవి రూపంలో గొబ్బెమ్మను పెట్టుకుంటారో వారు ముక్కునుమ రోజున తమ సమీపంలోని నదులు, చెరువుల వద్దకు వెళ్లి, గొబ్బెమ్మలను నిమజ్జనం చేస్తారు. అక్కడే కుటుంబ సభ్యులతో కలిసి గొబ్బెమ్మకు నైవేద్యం పెట్టిన వంటకాలను భుజిస్తారు. అంతేకాకుండా ఈ రోజున పిల్లలు, పెద్దలు పోటీపడి గాలిపటాలు కూడా ఎగురేస్తారు. మరికొందరు ఇదే రోజున వన భోజనాలు చేస్తారు. అంతేకాకుండా గ్రామ దేవతలను తల్చుకుంటూ మాంసాహారాన్నే వండుకునే ఆచారం కూడా ఉంది. అందుకనే దీనిని ముక్కల పండుగగా కూడా పిలుస్తారు. పండుగకు ఇంటికి వచ్చిన ఆడపడుచులకు పుట్టింటి వారు కొన్ని కానుకలు ఇచ్చి ముక్కనుమ నాడు వీడ్కోలు పలుకుతారు.
Also Read: Sankranti 2026 -23 ఏళ్ల తర్వాత సంక్రాంతి రోజే ఏకాదశి.. పుణ్యఫలం కోసం ఏం చేయాలంటే?

