Papankusha Ekadashi 2025 date and timing: హిందువులకు ఏకాదశి చాలా ప్రత్యేకమైనది. ఇది విష్ణుమూర్తికి అంకితం చేయబడినది. ప్రతి ఏటా 24 ఏకాదశులు ఉంటాయి. అందులో 12 శుక్లపక్ష మరియు 12 కృష్ణ పక్ష ఏకాదశులు. అశ్వినీ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని పాపాంకుశ ఏకాదశి అంటారు. ఇది సాధారణంగా సెప్టెంబరు లేదా అక్టోబర్ నెలలో వస్తుంది. ఈ అరుదైన ఏకాదశి రోజున లక్ష్మీ సమేతుడైన శ్రీహరిని పూజించడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందడంతోపాటు మరణానంతరం మోక్షం కూడా లభిస్తుంది. పాపాంకుశ ఏకాదశి ఎప్పుడు, శుభ ముహూర్తం, పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం.
పాపాంకుశ ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం
ఈ సంవత్సరం అశ్వినీ మాసం శుక్లపక్ష ఏకాదశి తిథి అక్టోబర్ 2, 2025న సాయంత్రం 07:10 గంటలకు ప్రారంభమై.. అక్టోబర్ 3, 2025న సాయంత్రం 06:32 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా పాపాంకుశ ఏకాదశిని అక్టోబర్ 3, శుక్రవారం జరుపుకోనున్నారు. అక్టోబర్ 4, 2025న ఉదయం 06:08 నుండి ఉదయం 08:30 వరకు పారణ సమయం ఉంటుంది. అక్టోబర్ 4, 2025న సాయంత్రం 05:09 గంటలకు పారణ ముగించే సమయం.
పూజా విధానం
పాపాంకుశ ఏకాదశి రోజున విష్ణువు అవతారమైన పద్మనాభుడిని పూజిస్తారు. అశ్వినీ మాసంలో శుక్ల పక్షం నాడు వచ్చే ఏకాదశిని భక్తులు ఆచరించడం వల్ల వారు స్వయంగా వైకుంఠానికి చేరుతారని నమ్మకం. ఈరోజున ఎవరైతే ఆహారం, నీరు, దుస్తులు, ఆవులు, భూములు దానం చేస్తారో వారు యమధర్మరాజును తప్పించుకుని వైకుంఠానికి వెళ్తారు.
Also read:Ekadashi 2025 -అక్టోబరులో అత్యంత అరుదైన ఏకాదశులు.. తేదీ, శుభ ముహూర్తం, ప్రాముఖ్యత తెలుసుకోండి..
ఈ ఏకాదశి రోజున భక్తులు తెల్లవారుజామునే లేచి తలస్నానం చేయాలి. అనంతరం ఉపవాస దీక్షను తీసుకుని గంగా జలంతో మీ ఇంటి పూజ గదిని శుభ్రం చేయాలి. పీఠంపై పసుపు రంగు వస్త్రాన్ని పరచి విష్ణుమూర్తి విగ్రహాన్ని లేదా ఫోటోను పెట్టి పూజ చేయాలి. పూలు, పండ్లు, స్వీట్స్ నైవేద్యంగా పెట్టి.. విష్ణు పారాయణం చేయడంతోపాటు మంత్రాలను జపించండి. చివరగా హారతి ఇచ్చి ప్రసాదాన్ని పంచి పూజను ముగించండి.


