Monday, February 16, 2026
HomeదైవంPhalguna Amavasya 2026: ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?

Phalguna Amavasya 2026: ఫాల్గుణ అమావాస్య ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?

Phalguna Amavasya 2026 Date and Significance in Telugu: హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్షం చివరి రోజును ఫాల్గుణ అమావాస్యగా జరుపుకుంటారు. ఆధ్యాత్మికంగా ఈ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పితృ దేవతలకు తర్పణాలు వదలడానికి, దానధర్మాలు చేయడానికి మరియు పుణ్య నదులలో స్నానాలు ఆచరించడానికి ఈ రోజు అత్యంత శ్రేష్టమైనదిగా భావిస్తారు.

- Advertisement -

అమావాస్య తిథి మరియు ముహూర్తం
2026లో ఫాల్గుణ అమావాస్య తిథి 16 ఫిబ్రవరి 2026, సాయంత్రం 05:36 గంటలకు ప్రారంభమై.. 17 ఫిబ్రవరి 2026, సాయంత్రం 05:32 గంటలకు ముగుస్తుంది. తిథిని అనుసరించి అమావాస్యను ఫిబ్రవరి 17, మంగళవారం నాడు ఆచరించనున్నారు.

ఫాల్గుణ అమావాస్య విశిష్టత
పురాణాల ప్రకారం, ఫాల్గుణ అమావాస్య రోజున గంగ, యమున, సరస్వతీ వంటి పుణ్య నదుల తీరాల్లో దేవతలు నివసిస్తారని నమ్ముతారు. ఈ రోజున పవిత్ర నదులలో (ముఖ్యంగా ప్రయాగ సంగమంలో) స్నానం చేయడం వల్ల తెలిసీ తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. జాతకంలో పితృ దోషం ఉన్నవారు ఈ రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల వారి పితృ దేవతలు సంతృప్తి చెంది, మోక్షాన్ని పొందుతారు. ఈ మాసంలో శివుడు మరియు కృష్ణ పరమాత్మను ఆరాధించడం వల్ల జీవితంలోని కష్టాలు, పేదరికం తొలగిపోయి సుఖశాంతులు చేకూరుతాయి.

Also Read: Phalguna Masam 2026 -ఫాల్గుణ మాసం ఎప్పటి నుంచంటే?

పూజా సామాగ్రి
గోమూత్రం, గంగాజలం, తెల్లని వస్త్రం, గోధుమలు, బియ్యం, తెల్లటి పువ్వులు, తమలపాకులు, వక్కలు, దానానికి బట్టలు, పండ్లు, ఐదు రకాల డ్రై ఫ్రూట్స్, నల్ల నువ్వులు, యవలు (బార్లీ), ధూపం మరియు దీపం.

పూజా విధానం
ఫాల్గుణ అమావాస్య నాడు ఉదయాన్నే నిద్రలేచి పుణ్య నదుల్లో స్నానం చేయాలి. కుదరని పక్షంలో ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొద్దిగా గంగాజలం కలుపుకుని స్నానం చేయవచ్చు. స్నానానంతరం సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి, రోజంతా ఉపవాసం ఉండాలని సంకల్పం చేసుకోవాలి. ఇంటి చుట్టూ గోమూత్రాన్ని చల్లి శుద్ధి చేయాలి. నదీ తీరంలో లేదా ఇంట్లోనే పితృ దేవతలకు తర్పణాలు వదిలి, బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. సాయంత్రం వేళ రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించి, పితృ దేవతలను స్మరించుకోవాలి. రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేయడం శుభప్రదం. ఈ రోజున బ్రాహ్మణులకు ఆవును దానం చేయడం లేదా ఆవుకు గ్రాసాన్ని తినిపించడం వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News