Pithori Amavasya 2025 Date and time: హిందూమతంలో అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను పిథోరి అమావాస్య అంటారు. దీనినే భాద్రపద అమావాస్య లేదా కుశగ్రాహిణి అమావాస్య లేదా అవని అమావాస్య అని అంటారు. ఈ రోజున కుశ గడ్డిని సేకరించడంతోపాటు పూర్వీకులకు స్నానం, దానం, పిండ ప్రదానం చేస్తారు. దీంతోపాటు ఈ అమావాస్య నాడు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. పిథోరి అమావాస్య తేదీ, ముహూర్తం, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.
పిథోరి అమావాస్య తేదీ, సమయం
అమావాస్య తిథి ప్రారంభం – ఆగస్టు 22, 2025 – 11:55 AM
అమావాస్య తిథి ముగింపు- ఆగస్టు 23, 2025 – 11:35 AM
పిథోరి వ్రత ప్రదోష ముహూర్తం – ఆగస్టు 22, 2025 – 06:53 PM నుండి 09:06 PM వరకు
పిథోరి అమావాస్య ప్రాముఖ్యత
హిందూ గ్రంథాల ప్రకారం, పిథోరి అమావాస్య రోజున పూర్వీకులను లేదా పితృ దేవతలను పూజిస్తారు. భాద్రపద అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి పవిత్ర నదుల్లో స్నానమాచరించి.. సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం పూర్వీకుల ఆత్మకు శాంతి చేకూరాలని వారికి తర్పణాలు వదిలి శ్రాద్ధకర్మలను చేయాలి. తర్వాత బ్రాహ్మణులకు లేదా పేదవారికి ఆహారం మరియు దుస్తులను దానం చేయాలి. అంతేకాకుండా ఈ పవిత్రమైన రోజున చాలా మంది గంగా నదిలో స్నానమాచరించి పుణ్యప్రదేశాలను సందర్శిస్తారు. కొంత మంది ఆధ్యాత్మిక లేదా మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాలసర్పదోషంతో బాధపడేవారు ఈరోజు పూజ చేయడంవల్ల దాని నుండి విముక్తి పొందుతారు.
Also Read: Shani Gochar 2025- దసరా వరకు ఈ 3 రాశులకు శనీశ్వరుడి కటాక్షం.. మీది ఉందా?
వ్రత ఆచరణ
పిథోరి అమావాస్య నాడు ఉపవాసం ఉండటం వల్ల పిల్లలు లేని దంపతులకు సంతానం కలుగుతుంది. వివాహిత స్త్రీలు నిండు నూరేళ్లు సౌభాగ్యం కోసం, పిల్లల ఆరోగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ అమావాస్యను పెళ్లైన స్త్రీలు మాత్రమే ఆచరిస్తారు. ఈరోజున వివాహిత స్త్రీలు సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఉపవాస దీక్షను తీసుకుంటారు. అంతేకాకుండా పిండితో 64 అమ్మవారి విగ్రహాలను తయారు చేసి శుభముహూర్తంలో పూజిస్తారు. 16 రకాలైన అలంకరణ వస్తువులను అమ్మవారికి సమర్పించాలి. బ్రాహ్మణునికి ఆహారం పెట్టి ఉపవాస దీక్షను విరమించాలి.
Disclaimer: ఈ కథనం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడమైనది. పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా ఈ వార్తను రూపొందించాం. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also read: Bhadrapada Masam 2025 – భాద్రపద మాసం ఎప్పటి నుంచి? ఈ నెలలో ఏం చేయాలి, ఏం చేయకూడదు?


