Saturday, November 15, 2025
HomeదైవంPradosh Vrat 2025: భౌమ ప్రదోష వ్రతం అంటే ఏమిటి? దీనిని ఎందుకు ఆచరించాలి?

Pradosh Vrat 2025: భౌమ ప్రదోష వ్రతం అంటే ఏమిటి? దీనిని ఎందుకు ఆచరించాలి?

Pradosh Vrat August 2025: ఆగస్టు నెల పండుగలకు , వ్రతాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం శ్రావణ మాసం నడుస్తోంది. ఈ నెలలో వచ్చే వ్రతాల్లో ప్రదోష వ్రతం ఒకటి. ప్రతి చాంద్రమాన పక్షంలో 13వ రోజున వస్తుంది. అయితే ఈ సారి వచ్చే ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే దీనిపై కుజుడు ప్రభావం ఉండనుంది. అంతేకాకుండా ఇది బుధవారం వస్తుంది కాబట్టి దీనిని భౌమ ప్రదోష వ్రతం లేదా బుధ ప్రదోష వ్రతం అని పిలుస్తారు.

- Advertisement -

ప్రదోష వ్రతంలో శివపార్వతులను ఆరాధిస్తారు. ఈరోజున భక్తుల ఉపవాసాన్ని ఆచరిస్తూ శివరాధాన చేయడం వల్ల మీరు అన్ని పాపాల నుండి విముక్తి పొందుతారు. అంతేకాకుండా మీరు అప్పులు, అనారోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. మీకు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. శ్రావణ మాసం శుక్లపక్షంలో రాబోయే ప్రదోష వ్రతం ఈ ఏడాది ఎప్పుడు వచ్చింది, ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం.

ప్రదోష వ్రతం తేదీ, శుభ సమయం

ప్రదోష వ్రతం త్రయోదశి తిథి ఆగస్టు 6, బుధవారం మధ్యాహ్నం 02:08 ప్రారంభమై..ఆగస్టు 07 మధ్యాహ్నాం 02:27 ముగుస్తుంది. ఉదయం తిథి ఆధారంగా ఆగస్టు 6న ప్రదోష వ్రతం జరుపుకుంటారు. వ్రతం జరుపుకోవడానికి శుభ సమయం సాయంత్రం 07:08 నుండి రాత్రి 09:16 వరకు.

Also read: Raksha Bandhan 2025 – రాఖీ పండుగ నాడు ఈ 3 రాశులపై కనక వర్షం కురిపించబోతున్న లక్ష్మీదేవి.. ఇందులో మీది ఉందా?

భౌమ ప్రదోష వ్రతం ప్రాముఖ్యత
పార్వతీపరమేశ్వరులకు అంకితం చేయబడింది ప్రదోష వ్రతం. భక్తులు చేసిన పాపాల నుంచి విముక్తి పొందడానికి, కోరికలు తీర్చుకోవడానికి మరియు మానసిక, ఆధ్యాత్మిక ప్రశాంతతను పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. సాయంత్రం సంధ్యా సమయంలో శివపార్వతులను నిష్టతో కొలుస్తారు. ఉపవాసాన్ని పాటిస్తూ.. బిల్వపత్రాలతో పూజించడం వల్ల శివుడు సంతోషిస్తాడు. భౌమ ప్రదోష వ్రతాన్ని క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల ఆ దేవుడి కృప మీపై పడి మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవిస్తారు.

Also read: Putrada Ekadashi in August 2025 – సంతానం లేని దంపతులు పుత్రద ఏకాదశిని ఆచరించాల్సిందే..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad