Radha Ashtami 2025 Date and puja timings: ప్రేమకు ప్రతీక రాధాకృష్ణులు. అలాంటి రాధాదేవీ జన్మదినాన్నే రాధాష్టమి లేదా రాధా జయంతిగా జరుపుకుంటారు. శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథినాడు శ్రీకృష్ణుడు జన్మిస్తే.. అది జరిగిన పదిహేను రోజులకు శుక్ల పక్ష అష్టమి తిథినాడు రాధాదేవి జన్మిస్తుంది. హిందువులు రాధా మాతను లక్ష్మీదేవి అవతారంగా, శ్రీకృష్ణుని ప్రేయసిగా భావిస్తారు. అలాంటి రాధాష్టమి ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చిందో తెలుసా?
రాధాష్టమి తేదీ, శుభముహూర్తం
అష్టమి తిథి ఆగస్టు 30, 2025 రాత్రి 10:46 గంటలకు ప్రారంభమై.. సెప్టెంబర్ 1, 2025 మధ్యాహ్నం 12:57 గంటలకు ముగుస్తుంది. తిథిని అనుసరించి రాధాష్టమిని ఆగస్టు 31న జరుపుకోనున్నారు. పూజ సమయం: ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 1:38 PM (2 గంటల 33 నిమిషాలు).
Also Read:Janmashtami 2025- నేడే కృష్ణాష్టమి.. శుభ ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..
రాధాష్టమి పూజా విధానం
ఈ రోజున భక్తులు తెల్లవారుజామునే లేచి స్నానమాచరించి శుభ్రమైన బట్టలు ధరించాలి. అనంతరం ఇంట్లోని పూజా మందిరాన్ని శుభ్రం చేసి రాధాదేవి విగ్రహాన్ని లేదా చిత్రపటాన్ని ప్రతిష్టించాలి. అనంతరం పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఉపవాసం ఆచరిస్తూ.. మరియు మధ్యాహ్న సమయంలో రాధా దేవి ఆరాధన చేయాలి.అదే రోజు సాయంత్రం భక్తులు వారి ఇంటి ప్రధాన ద్వారం వద్ద 11 దీపాలను వెలిగించాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు లభిస్తాయి. రాధా చాలీసా పారాయణంతో పాటు, సువాసన గల పువ్వులు మరియు అలంకార కండువా (చునారి) రాధ దేవికి సమర్పించడం శుభప్రదం.
రాధాష్టమి నాడు జపించే మంత్రాలు: ఓం వ్రాష్బనుజాయే విద్మహే, కృష్ణప్రియయే ధీరాహి తనో రాధా ప్రచోదయ , రాధే రాధే.
Also Read: Shukra Gochar 2025- సొంతరాశిలోకి శుక్రుడు.. ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు..
రాధాష్టమి మరింత సమాచారం..
పద్మ పురాణం లో కూడా రాధాష్టమి పండుగ గురించి పేర్కొన్నారు. రాధా వల్లభ్ ఆలయం, బృందావనం, సేవాకుంజ్ లలో రాధాష్టమి ఉత్సవాలు తొమ్మిది రోజులపాటు ఘనంగా జరుగుతాయి. ఇస్కాన్ కు సంబంధించిన దేవాలయాల్లో రాధారాణికి ఈ రోజున మహాభిషేకం చేస్తారు. బ్రజ్ ప్రాంతంలో కూడా రాధాష్టమిని అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఇక్కడ భక్తులు రాధా మాత పాదాల దర్శనం పొందుతారు. శివుడి యాత్రకు పిలువబడే మణిమహేష్ యాత్ర కృష్ణ జన్మాష్టమి రోజున మెుదలయ్యి.. రాధాష్టమితో ముగుస్తుంది. ఈ యాత్రను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం స్పాన్సర్ చేస్తోంది.


