Saturday, November 15, 2025
HomeదైవంUtpanna Ekadashi 2025: ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15 లేదా 16నా? ఖచ్చితమైన తేదీ, శుభ...

Utpanna Ekadashi 2025: ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15 లేదా 16నా? ఖచ్చితమైన తేదీ, శుభ ముహూర్తం తెలుసుకోండి..

Utpanna Ekadashi 2025 Date and Time: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కార్తీక మాసం నడుస్తోంది. ఉత్తర భారతదేశంలో నవంబర్ 06 నుంచి మార్గశిర మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో కృష్ణపక్ష ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అంటారు. హిందువులు ఈ ఏకాదశిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది విష్ణువుకు అంకితం చేయబడినది. ఈరోజునే దుర్గాదేవి ముర అనే రాక్షసుడుని సంహరించి ఏకాదశి మాతగా పిలువబడింది. ఈరోజున శ్రీమహావిష్ణువుతోపాటు తులసి దేవిని పూజిస్తారు. ఈ ఉపవాసం పాటించడం వల్ల మీ యెుక్క అన్ని పాపాలు తొలగిపోతాయి. అంతేకాకుండా మరణానంతరం మోక్షం లభిస్తుంది. ఈ సంవత్సరం ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం తెలుసుకోండి.

- Advertisement -

ఉత్పన్న ఏకాదశి తేదీ, శుభ ముహూర్తం
పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి 15 నవంబర్ 2025న రాత్రి 12:49కి ప్రారంభమై..నవంబర్ 16న రాత్రి 2:37కి ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం, ఉత్పన్న ఏకాదశి నవంబర్ 15న జరుపుకోనున్నారు. ఉత్పన్న ఏకాదశి నాడు ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉండబోతుంది. దీంతోపాటు విష్కుంభ యోగం కూడా ఏర్పడుతుంది. దీని వల్ల ఏకాదశికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. పైగా ఇదే రోజు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి 12:27 వరకు ఉంటుంది.

ఈ ఏకాదశి వ్రతాన్ని పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా పాటిస్తారు. దీని వల్ల మీ జీవితంలో శాంతిపాటు ఆనందం కూడా ఉంటుంది. ఉత్పన్న ఏకాదశి నాడు విష్ణువుకు పసుపు రంగు వస్తువులను సమర్పించడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. పూర్దిగా ఉపవాసం చేయలేకపోతే ఉదయాన్నే తేలిక పాటి ఆహారాన్ని తీసుకోండి. ధాన్యాలు, బియ్యం వంటి తీసుకోవడం మానుకోండి. మనస్సును దేవుడిపై లగ్నం చేసి ప్రశాంతంగా ఉండండి.

Also Read: Powerful Rajyog-నవంబర్ 10 నుండి ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్.. మీది ఉందా?

పురాణ కథనం
కృత యుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సాదువులను, మానవులను క్రూరంగా హింసించే వాడు. ఆ దానవుడి ఆగడాలు తట్టుకోలేక దేవతలు శ్రీమహావిష్ణువును శరణు వేడుతారు. దీంతో శ్రీహరి అతడిని సంహరించేందుకు బయలుదేరుతాడు. ఈ సమయంలో మురుడు సముద్ర గర్భంలోకి దాక్కుని ఉంటాడు. అతడిని బయటకు రప్పించేందుకు నారాయణుడు గుహలోకి వెళ్లి నిద్రపోతున్నట్లు నటిస్తాడు. అదే మంచి సమయం అనుకున్న మురాసురుడు గుహలోకి వచ్చి విష్ణువును వధించేందుకు కత్తి ఎత్తుతాడు. ఆ సమయంలో లక్ష్మీదేవి దుర్గమ్మ రూపంలో ప్రత్యక్షమై మురుడిని సంహరించింది. ప్రసన్నుడైన శ్రీహరి ఆమెకు ఏకాదశి అనే బిరుదును ఇచ్చాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad