Thursday, March 12, 2026
HomeదైవంVijaya Ekadashi 2026: విజయ ఏకాదశి.. ఫిబ్రవరి 13నా లేక 14నా?

Vijaya Ekadashi 2026: విజయ ఏకాదశి.. ఫిబ్రవరి 13నా లేక 14నా?

Vijaya Ekadashi 2026 date and Significance in Telugu: హిందూ ధర్మంలో ఏకాదశి తిథికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ‘విజయ ఏకాదశి’ భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైనది. పేరుకు తగ్గట్టుగానే ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల శత్రువులపై విజయం, చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి సక్సెస్ లభిస్తుందని భక్తుల నమ్మకం. మరి 2026లో ఈ ఏకాదశి ఏ రోజు వచ్చింది? ఉపవాసం ఎప్పుడు విరమించాలి? వంటి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

తేదీ మరియు శుభ ముహూర్తం
ఈ ఏడాది విజయ ఏకాదశి ఫిబ్రవరి 13, శుక్రవారం నాడు వచ్చింది.

ఏకాదశి తిథి ప్రారంభం: ఫిబ్రవరి 12, 2026 మధ్యాహ్నం 12:22 గంటలకు.

ఏకాదశి తిథి ముగింపు: ఫిబ్రవరి 13, 2026 మధ్యాహ్నం 02:25 గంటలకు.

పారణ తేదీ (ఉపవాస విరమణ): ఫిబ్రవరి 14, 2026 (శనివారం).

పారణ సమయం: ఉదయం 07:00 గంటల నుండి 09:14 గంటల మధ్య.

ద్వాదశి ముగింపు: ఫిబ్రవరి 14 సాయంత్రం 04:01 గంటలకు.

పూజా విధానం
ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, పవిత్ర స్నానం ఆచరించాలి. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో కొలిచి, వేద మంత్రాలను పఠించాలి. తాజా పండ్లు, పూలు, తులసి దళాలు మరియు స్వీట్లను స్వామివారికి సమర్పించాలి. వ్రతం ముగిసిన తర్వాత బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయడం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. ఉపవాస సమయంలో మరియు పారణ రోజున కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. తామసిక ఆహారానికి దూరంగా ఉండాలి.

Also Read: Janaki Jayanti 2026 -జానకీ జయంతి రోజున సీతమ్మను ఇలా పూజిస్తే.. అఖండ సౌభాగ్యం మీ సొంతం!

విజయ ఏకాదశి విశిష్టత
ఈ ఏకాదశి ప్రాముఖ్యత రామాయణ కాలం నాటిది. సీతాదేవిని రక్షించడానికి లంకకు వెళ్లే క్రమంలో, సముద్రాన్ని దాటడానికి ముందు శ్రీరామచంద్రుడు స్వయంగా విజయ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ వ్రత ప్రభావం వల్లే శ్రీరాముడు రావణునిపై విజయం సాధించాడని నమ్ముతారు. అందుకే కష్టాల్లో ఉన్నవారు, విజయం కోరుకునే వారు ఈ వ్రతాన్ని అత్యంత భక్తితో ఆచరిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News