Bhadrapad Month Significance: తెలుగు సంవత్సరాదిలో ఆరో నెల భాద్రపద మాసం. చాంద్రమానం ప్రకారం, ఈ నెలలో పౌర్ణమి నాడు పూర్వా భద్ర లేదా ఉత్తర భద్ర నక్షత్రం ఉండటం వల్ల దీనిని భాద్రపద మాసం అంటారు. ఈ మాసంలోనే వర్షాలు అధికంగా పడతాయి. ఈ సంవత్సరం భాద్రపద మాసం ఆగస్టు 23 నుంచి ప్రారంభం కానుంది. అయితే ఉత్తర భారతదేశంలో ఆగస్టు 10 నుంచే భాద్రపదం మెుదలై.. సెప్టెంబరు 7 వరకు కొనసాగనుంది. ఈ మాసంలోనే హిందువుల ముఖ్ఖ్య పండుగలైన వినాయక చవితి, రాధాష్టామి, ఓనమ్ రాబోతున్నాయి. అంతేకాకుండా హర్తాలీకా తీజ్, పరివర్తినీ ఏకాదశి, ప్రదోషం వంటి వ్రతాలు కూడా జరుపుకోనున్నారు. మరోవైపు వచ్చే నెల 7న చంద్రగ్రహణం కూాడా ఏర్పడనుంది.
భాద్రపద మాసంలో ప్రధాన పండుగలు:
ఆగస్టు 23: భాద్రపద అమావాస్య, పోల పండుగ
ఆగస్టు 25: వరాహ జయంతి
ఆగస్టు 26: హర్తాళికా తీజ్
ఆగస్టు 27: గణేష్ చతుర్థి
ఆగస్టు 28: ఋషి పంచమి
ఆగస్టు 31: రాధా అష్టమి, మహాలక్ష్మీ వ్రతం ప్రారంభం
సెప్టెంబర్ 3: పరివర్తిని ఏకాదశి
సెప్టెంబర్ 4: వామన జయంతి
సెప్టెంబర్ 5: ఓనం, ప్రదోష వ్రతం
సెప్టెంబర్ 6: గణేష్ విసర్జన్, అనంత్ చతుర్దశి
సెప్టెంబర్ 7: భాద్రపద పూర్ణిమ, చంద్రగ్రహణం
భాద్రపద మాసంలో ఏమి చేయాలి?
**శాస్త్రాలలో చెప్పబడిన విధంగా పవిత్ర నదులలో స్నానమాచరించి పుణ్యక్షేత్రాలను సందర్శించండి.
**సంపద, శ్రేయస్సు మరియు సంతానప్రాప్తి కోసం బాలగోపాలుడిని పూజించండి.
**వినాయక చవితి నాడు మీ ఇంట్లో గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించి పది రోజులపాటు భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి.
**ఈ నెలలో సాత్విక ఆహారం మాత్రమే భుజించండి. ఎందుకంటే ఇది శరీరం మరియు మనస్సును శుభ్రపరుస్తుంది.
**లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి ప్రతిరోజూ తులసిని పూజించండి.
భాద్రపద మాసంలో ఏమి చేయకూడదు?
**మాంసం మరియు మద్యం సేవించడం మానుకోండి, ఎందుకంటే ఇది దేవతల కోపానికి కారణమవుతుంది.
**ఈ నెలలో ఉడికించని ఆహారాలు, పెరుగు మరియు బెల్లం తినడం మానుకోండి.
**ఆదివారాల్లో మీ జుట్టును కత్తిరించుకోకండి, దాంతోపాటు ఉప్పును తినడం మానుకోండి.
**వేరొకరు ఇచ్చిన బియ్యం లేదా కొబ్బరి నూనెను వాడకండి.
Also Read: Dasara 2025- ఈ ఏడాది దసరా ఎప్పుడు? పండుగ విశిష్టత ఏంటో తెలుసా?
Disclaimer: ఈ కథనం హిందూ మత గ్రంథాలు, పురాణాలు, పండితుల సూచనలు, ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా రూపొందించబడింది. దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు. ఈ కథనాన్ని తెలుగు ప్రభ ధృవీకరించలేదు.
Also Read: Aja Ekadashi 2025 – అజ ఏకాదశి ఆగస్టు 18నా లేదా 19నా? ఖచ్చితమైన తేదీ తెలుసుకోండి..


