Saturday, November 15, 2025
HomeదైవంTemple Rules:చెప్పులు లేకుండా గుళ్లోకి ఎందుకు వెళ్లాలో తెలుసా!

Temple Rules:చెప్పులు లేకుండా గుళ్లోకి ఎందుకు వెళ్లాలో తెలుసా!

Remove Footwear In Temple:భారతీయ సంస్కృతిలో గుడి అనేది పవిత్రతకు ప్రతీక. మనలో చాలామంది దేవాలయానికి వెళ్లేటప్పుడు చెప్పులు తీయడం అనేది చాలా మామూలు చర్య. కానీ ఈ ఆచారం వెనుక ఉన్న అర్థం తెలుసుకునే ప్రయత్నం చాలా మంది తెలుసుకోవాలని అనుకోరు. వాస్తవానికి ఇది కేవలం సంప్రదాయం మాత్రమే కాకుండా ఆధ్యాత్మికతతో పాటు శాస్త్రీయ కారణాలూ కలిగిన ఆచారమని పండితులు చెబుతున్నారు.

- Advertisement -

పవిత్రత, శుభ్రత ప్రధాన పాత్ర…

వేదకాలం నుంచే పవిత్ర స్థలాల్లో చెప్పులు లేకుండా అడుగుపెట్టడం ఒక ముఖ్యమైన నియమంగా పేర్కొన్నారు. దేవాలయం అనేది మనం దైవంతో ఏకమయ్యే ప్రదేశం. ఆ ప్రదేశంలో పవిత్రత, శుభ్రత ప్రధాన పాత్ర పోషిస్తాయి. చెప్పులు వేసుకొని లోపలికి వెళితే బయట ఉన్న ధూళి, అపవిత్రత, మలినాలు గుడిలోకి వస్తాయి. అందుకే ఆలయ ప్రవేశం ముందు చెప్పులు తీయడం అనేది భక్తుడి బాధ్యతగా పండితులు వివరిస్తున్నారు.

Also Read:https://teluguprabha.net/devotional-news/three-zodiac-signs-to-benefit-from-malavya-rajayoga-in-november/

పసుపు, గంధం, సింధూరం…

అదేకాలంలో చెప్పులు లేకుండా నేలపై నడవడం శరీరానికి ఆరోగ్యకరమని కూడా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేవాలయాల నేలపై సాధారణంగా పసుపు, గంధం, సింధూరం వంటి సహజ పదార్థాలు పూస్తారు. ఇవి ఆయుర్వేదం ప్రకారం శరీరానికి శాంతి, శుభ్రత, సానుకూల శక్తిని అందిస్తాయి. చెప్పులు లేకుండా నేలను తాకినప్పుడు ఈ పదార్థాల ప్రభావం పాదాల ద్వారా శరీరంలోకి చేరి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది.

శ్రద్ధతో, గౌరవంతో దేవుడిని…

హిందూ ధర్మం ప్రకారం గుడిలోకి చెప్పులు వేసుకుని అడుగుపెట్టడం అనేది దైవాన్ని అవమానించినట్లుగా భావిస్తారు. భగవంతుడు ఉన్న స్థలం పవిత్రమైనదని నమ్మకం. భక్తుడు వినమ్రతతో, శ్రద్ధతో, గౌరవంతో దేవుడిని దర్శించుకోవాలి. అందుకే గుడి లోపలికి అడుగుపెట్టే ముందు చెప్పులు మాత్రమే కాకుండా తోలుతో చేసిన వస్తువులు వంటి బెల్టులు, పర్సులు తీసుకెళ్లకూడదనే నియమం కూడా అనేక ఆలయాల్లో పాటించబడుతోంది.

మనస్సును ప్రశాంతంగా..

ఆలయం అనేది కేవలం ప్రార్థన చేసే స్థలం కాదు, మన మనస్సును ప్రశాంతంగా ఉంచే స్థలం కూడా. చెప్పులు లేకుండా దేవాలయంలో అడుగుపెట్టినప్పుడు ఆ ప్రదేశంలో ఉండే ఆధ్యాత్మిక తరంగాలు పాదాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయని నమ్మకం. ఈ తరంగాలు మనసుకు శాంతిని, ఆత్మకు విశ్రాంతిని కలిగిస్తాయి. అనేక ఆధ్యాత్మిక గ్రంథాల్లో కూడా ఆలయ నేలలో ఉండే శక్తి భక్తుడికి దైవ అనుభూతిని కలిగిస్తుందని చెప్పబడింది.

భూమి నుంచి వచ్చే శక్తి..

మన శరీరం ప్రకృతితో ముడిపడి ఉంటుంది. పాదాలు నేలను తాకినప్పుడు భూమి నుంచి వచ్చే శక్తి శరీరంలోకి ప్రవహిస్తుంది. దేవాలయాల నిర్మాణం కూడా దీనిని దృష్టిలో ఉంచుకొని చేస్తారు. శిల్పకళ, ధ్వని తరంగాలు, గర్భగృహ నిర్మాణం అన్నీ కలిసి సానుకూల శక్తిని ప్రసరిస్తాయి. చెప్పులు లేకుండా లోపలికి వెళితే ఆ శక్తిని మనం సులభంగా అనుభవించగలము.

అలాగే చెప్పులు తీయడం భక్తుడి మనసులో వినమ్రతను పెంపొందిస్తుంది. గుడి ద్వారం వద్ద చెప్పులు విడిచి కాళ్లు కడిగి లోపల అడుగుపెట్టడం అంటే బయట ప్రపంచంలోని అహంకారం, అపవిత్రతలను అక్కడే వదిలి దేవుడి సన్నిధిలో నిష్కల్మషంగా నిలబడడం అనే భావనను సూచిస్తుంది. ఇది భగవంతుడిపై ఉన్న భక్తి, వినయానికి ప్రతీక.

Also Read:https://teluguprabha.net/devotional-news/bhai-dooj-2025-festival-date-story-and-significance/

కొంతమంది ఇది కేవలం మతపరమైన నియమమని అనుకుంటారు. కానీ దీనికి శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. చెప్పులు ఎక్కువసేపు ధరించడం వల్ల పాదాల్లో దుమ్ము, బాక్టీరియా పేరుకుపోతాయి. వాటితో గుడిలోకి వెళితే ఇతరులకు వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంటుంది. అందుకే పరిశుభ్రత పరంగా కూడా చెప్పులు తీయడం ఒక ఆరోగ్య రక్షణ చర్య.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad