Monday, November 17, 2025
HomeదైవంVastu: ఖాళీ శంఖాన్ని పూజగదిలో ఉంచితే శుభమా..అశుభమా?

Vastu: ఖాళీ శంఖాన్ని పూజగదిలో ఉంచితే శుభమా..అశుభమా?

Vastu Rules: మన సంప్రదాయంలో శంఖం ఒక పవిత్రమైన వస్తువుగా పండితులు చెబుతారు. వాస్తు శాస్త్రం, పురాణాలు రెండింటిలోనూ దీనికి ప్రత్యేక ప్రాధాన్యం,స్థానం ఉందనే విషయం తెలిసిందే. దేవతారాధనలో శంఖం ఊదటం వల్ల వాతావరణం పరిశుభ్రంగా మారుతుందని, దుష్టశక్తులు పారిపోతాయనే నమ్మకం ఉంది. కానీ ప్రతి పవిత్ర వస్తువులాగే, శంఖాన్ని కూడా సరిగ్గా ఉంచడం అనేది చాలా ముఖ్యమని పండితులు వివరిస్తున్నారు. కానీ దాని విషయంలో కొన్ని నియమాలు పాటించకపోతే మాత్రం ఇంట్లో ఆర్థిక సమస్యలు లేదా ప్రతికూల శక్తులు పెరిగే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

లక్ష్మీదేవి స్వరూపంగా..

శంఖం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. సముద్ర మథనం సమయంలో లక్ష్మీదేవితో పాటు శంఖం కూడా పుట్టినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీన్ని ఇంట్లో ఉంచడం అదృష్టాన్ని, ఆర్థిక శ్రేయస్సును తీసుకుని వస్తుందనే నమ్మకం ఉంది. అయితే ఖాళీ శంఖం ఉంచడం మాత్రం అనేక దుష్ప్రభావాలను కలిగించవచ్చని పండితులు చెబుతున్నారు.

Also Read: https://teluguprabha.net/devotional-news/why-roti-pan-should-not-be-kept-upside-down-in-kitchen/

పూజ గదిలో ఖాళీ శంఖం ఉంచడం వల్ల దైవిక శక్తిని తగ్గిపోతుందని వాస్తు శాస్త్రం వివరిస్తుంది. శంఖం ఒక పవిత్రమైన చిహ్నం, దానిలో శుభశక్తి నిండి ఉంటుంది. కానీ అది ఖాళీగా ఉన్నప్పుడు ఆ శక్తి క్రమంగా తగ్గిపోతుందని పండితులు,వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ శూన్యత కారణంగా ఇంటి వాతావరణంలో ప్రతికూల శక్తి ప్రవేశించడానికి అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ఖాళీ శంఖం ఇంటిలో..

వాస్తు ప్రకారం, ఖాళీ శంఖం ఇంటిలో ఉంచడం వల్ల దారిద్య్రం, ఆర్థిక నష్టం కలగవచ్చని చెబుతారు. కారణం, శంఖాన్ని లక్ష్మీదేవితో అనుసంధానించడం. ఆమెకు ఖాళీ స్థలాలు లేదా శూన్యత నచ్చవని వాస్తు గ్రంథాలు పేర్కొంటాయి. కాబట్టి శంఖం ఖాళీగా ఉంచితే లక్ష్మీ ఆ స్థలాన్ని విడిచి వెళ్తుందని, దాంతో ఇంటిలో సంపద, శ్రేయస్సు తగ్గుతాయని నమ్మకం ఉంది.

నీటితో నింపి ఉంచడం..

దీనికి పరిష్కారంగా, శంఖాన్ని ఎప్పుడూ నీటితో నింపి ఉంచడం మంచిదని చెబుతారు. రోజూ పూజకు ముందు శంఖాన్ని శుభ్రపరచి గంగా జలం లేదా శుద్ధమైన నీటిని నింపడం ఆచారం. ఈ నీటికి ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. శంఖంలో నిల్వ చేసిన ఈ నీరు సానుకూల శక్తిని ప్రసారం చేస్తుందని, ఇంటి వాతావరణాన్ని పవిత్రంగా ఉంచుతుందని విశ్వాసం ఉంది.

ఇంట్లో అంతా చల్లడం..

తర్వాత రోజు ఉదయం ఆ నీటిని పారేయకుండా ఇంట్లో అంతా చల్లడం అనేది మంచిదిగా పండితులు చెబుతుంటారు. ఈ విధానం వాస్తు దోషాలను తగ్గిస్తుందని, దుష్ట శక్తులు ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటుందని చెబుతారు. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే, ఈ నీటిని భగవంతుని విగ్రహానికి అభిషేకంగా ఉపయోగించడం కూడా శుభప్రదంగా పండితులు చెబుతున్నారు.

ఇది మాత్రమే కాదు, శంఖంలో నీటి బదులు పువ్వులు లేదా బియ్యాన్ని ఉంచడం కూడా మంచి ఫలితాలను ఇస్తుందనే నమ్మకం ఉంది. బియ్యం లక్ష్మీదేవికి ప్రియమైనదిగా చెబుతారు. కనుక శంఖంలో బియ్యాన్ని ఉంచడం సంపదను ఆకర్షిస్తుందని చెబుతారు. పువ్వులు కూడా పవిత్రతకు సూచికలు కావడంతో, అవి సానుకూల శక్తిని నిలుపుతాయని విశ్వాసం.

Also Read:https://teluguprabha.net/devotional-news/mercury-transit-in-libra-brings-good-fortune-for-three-zodiac-signs/

వాస్తు ప్రకారం శంఖాన్ని ఎక్కడ, ఎలా ఉంచాలో కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. పూజాగదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే, ఆయన కుడివైపున శంఖాన్ని ఉంచడం అత్యంత శుభప్రదం. అలాగే ఈశాన్య దిశలో ఉంచడం కూడా వాస్తు దృష్ట్యా మంచిదిగా చెప్పుకోవచ్చు.

శంఖాన్ని నేలపై నేరుగా ఉంచకూడదు. ఎల్లప్పుడూ శుభ్రమైన ఎరుపు లేదా పసుపు గుడ్డ మీద లేదా రాగి, ఇత్తడి పళ్ళెంలో ఉంచాలి. ఇవి పవిత్రమైన లోహాలుగా చెప్పడంతో పాటు దైవికశక్తిని, పాజిటివిటీని కూడా ఆకర్షిస్తాయని పండితులు వివరిస్తున్నారు.

ఒకటి కంటే ఎక్కువ శంఖాలు

ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, పూజాగదిలో ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఉంచకూడదు. ఎందుకంటే ఒకటి కంటే ఎక్కువ శంఖాలు ఉంచితే లక్ష్మీదేవి ఆశీర్వాదం తగ్గుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే కొందరు పూజల కోసం ఒక శంఖం, ఊదటానికి మరో శంఖం ఉంచడం సరైనదని చెబుతుంటారు.

విరిగిన లేదా పగిలిన శంఖాలను ఇంట్లో ఉంచకూడదు. అవి శుభశక్తిని దెబ్బతీస్తాయని, దుష్టశక్తులకు మార్గం కల్పిస్తాయని భావిస్తారు. కాబట్టి ఒకసారి శంఖం దెబ్బతింటే దాన్ని పవిత్రంగా గమనించి, గంగాజలంలో లేదా పవిత్ర నదిలో నిమజ్జనం చేయడం మంచిదని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News