HomeదైవంJanmashtami: కృష్ణాష్టమి నాడు ఇంట్లో చిన్ని కృష్ణుని పాదాలు ఎందుకు వేస్తారో తెలుసా?

Janmashtami: కృష్ణాష్టమి నాడు ఇంట్లో చిన్ని కృష్ణుని పాదాలు ఎందుకు వేస్తారో తెలుసా?

Krishna Janmashtami: కృష్టాష్టమి ని దేశ వ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. చిన్ని కృష్ణుడితో పాటు ఇళ్లను,దేవాలయాలను కూడా ఎంతో అందంగా ముస్తాబు చేసి పూజలు నిర్వహిస్తారు.అర్థరాత్రి సమయంలో కృష్ణుడి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించడం ఈ పండగ ప్రత్యేకత.
ఈ పండుగలో ఇంటి గుమ్మం నుంచి పూజా మందిరం వరకు బాల గోపాలుడి చిన్న పాద ముద్రలను వేయడం కూడా ఒకటి.

- Advertisement -

చిన్ని కృష్ణుడు స్వయంగా తమ ఇంట్లోకి అడుగుపెడుతున్నాడనే భావనతో భక్తులు ఈ పాదముద్రలను అలంకరిస్తారు. అయితే ఈ సంప్రదాయం వెనుక ఉన్న విశ్వాసం ఏంటి? పాదముద్రలను ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలి? అనే విషయాలను తెలుసుకుందాం.

అసలు జన్మాష్టమి ఎప్పుడు?
కృష్ణాష్టమి సెప్టెంబర్‌ 4న తెల్లవారుజామున 2.25 గంటలకు ప్రారంభమై,సెప్టెంబర్‌ 5న అర్థరాత్రి 12.13 గంటలకు ముగుస్తుంది.శ్రీకృష్ణుడి జన్మోత్సవాన్ని నిశిత కాలంలో నిర్వహించే సంప్రదాయం ఉంది.

పాదముద్రలు ఎందుకు వేస్తారు?
జన్మాష్టమి రోజున ఇంట్లో బాలకృష్ణుడి చిన్న పాదముద్రలను వేయడం ఆయన ఇంట్లోకి అడుగుపెడుతున్నాడనే భావన ఉంటుంది. శ్రీకృష్ణుడిని తమ ఇంటికి పిలుస్తున్నామనే ఆనందంతో ఈ సంప్రదాయాన్ని పాటిస్తారు. సాధారణంగా ఇంటి ప్రధాన ద్వారం నుంచి పూజా గది వరకు చిన్న చిన్న పాదముద్రలను వేస్తారు.

శ్రీకృష్ణుడి ఇంటి రాకకు చిహ్నంగా..

జన్మాష్టమి సందర్భంగా ఇళ్లలో ఉయ్యాలలు కట్టి కృష్ణుడిని బాలుడిలా అలంకరించడం,నైవేద్యాలు సమర్పించడం వంటి సంప్రదాయాలు పాటిస్తారు. ఇంటి గుమ్మం నుంచి లోపలికి వచ్చేలా పాదముద్రలను వేయడం ద్వారా బాలకృష్ణుడికి ఆహ్వానం పలుకుతున్నట్లుగా భావిస్తారు. భక్తుల నమ్మకం ప్రకారం, కృష్ణుడి పాదముద్రలు ఇంట్లోకి ఆనందం, శాంతి, సంతోషం, సానుకూలత రావడానికి ప్రతీకగా ఉంటాయని భక్తులు నమ్ముతారు.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News