Saturday, November 15, 2025
HomeదైవంMauni Amavasya 2025: రేపే మౌని అమావాస్య.. ఎందుకంత విశిష్టమైనది..?

Mauni Amavasya 2025: రేపే మౌని అమావాస్య.. ఎందుకంత విశిష్టమైనది..?

మరికొన్ని గంటల్లో (బుధవారం)మౌని అమావాస్య (Mauni Amavasya) రానుంది. కుంభమేళా (Kumbmela) జరుగుతున్న వేళలో ఈ అమావాస్య ప్రత్యేకమైనదిగా పురాణాలు చెబుతున్నాయి. ఇంతకు మౌని అంటే సంస్కృతంలో మౌనంగా ఉండటం. ఆ రోజున మౌనదీక్ష పాటించాల్సి ఉంటుంది. ఎవరితోనూ మాట్లాడకుండా పూర్తిగా మౌనంగా ఉండటమే దీని ముఖ్య ఉద్దేశ్యమని పురాణాలు చెబుతున్నాయి.

- Advertisement -

ఎన్నో జన్మల పుణ్యఫలం
మహా శివరాత్రి ముందు వచ్చే అమావాస్య కావడంతో సాధువులు, యోగ సాధకులు దీన్ని పవిత్రంగా పరిగణిస్తారు. ఈ సమయంలో పుణ్య స్నానమాచరిస్తే ఎన్నోజన్మల పుణ్యం లభిస్తుందని నమ్మకం.

మౌని అమావాస్యకు ప్రత్యేకత
మహ కుంభమేళా జరుగుతున్న వేళలో మౌని అమావాస్యకు ప్రత్యేకత సంతరించుకుంది. దీంతో త్రివేణీ లో స్నానామాచరించేందుకు కొన్ని వేల కిలోమీటర్ల నుంచి దేశ నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివస్తున్నారు.

భక్తులతో రద్దీగా
దీంతో కుంభమేళా భక్తులతో రద్దీగా మారింది. భక్తులతో కిక్కిరెేసి పోవటంతో అధికారులు వీడియోను, ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇది చరిత్రలో మరిచిపోని ఘట్టమని తెలిపారు. ఒక్కరోజులోనే సూమారు 10 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

చెట్లను పూజిస్తే మంచి ఫలితాలు
అమావాస్య నాడు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయంటా. చెట్లను, మొక్కలను పూజించడం ద్వారా పూర్వీకుల అనుగ్రహం నిలిచి ఉంటుందని భావిస్తారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad