Kitchen Vastu:ప్రతీ ఇంట్లో రోటీ లేదా దోశ పాన్ ఉపయోగించడం అనేది చాలా సాధారణమైన విషయమే. చాలా మంది వంట పూర్తయిన తర్వాత పాన్ చల్లారిన వెంటనే దాన్ని తలకిందులుగా ఉంచుతారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఈ చిన్న అలవాటు కూడా ఇంట్లో నెగటివ్ ఎనర్జీని కలిగించే అంశంగా భావిస్తారు. వంటగదిలో పాన్ తలకిందులుగా పెట్టడం ఎందుకు మంచిది కాదని, దానివల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసుకుందాం.
ప్రతి చిన్న పని కూడా..
వాస్తు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, వంటగది అనేది ఇంటి శ్రేయస్సుతో నేరుగా సంబంధమై ఉన్న ప్రదేశం. ఇక్కడ జరిగే ప్రతి చిన్న పని కూడా కుటుంబ జీవనశైలిపై ప్రభావం చూపుతుందని అంటారు. అందుకే వంట పాత్రల వినియోగంలోనూ కొంత జాగ్రత్త అవసరమని వాస్తు పండితులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోటీ లేదా దోశ పాన్‌ను వాడిన తర్వాత తలకిందులుగా ఉంచడం వలన ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, పనులు అడ్డంకులు ఎదుర్కోవడం వంటి సమస్యలు రావచ్చని చెబుతున్నారు.
అశుభకరమైన సంకేతంగా..
వాస్తు ప్రకారం, పాన్‌ను తలకిందులుగా ఉంచడం అశుభకరమైన సంకేతంగా పరిగణిస్తారు. ఇది ఇంట్లో శాంతి భద్రతలకు భంగం కలిగించగలదని, ప్రతికూల శక్తి ప్రవేశానికి కారణమవుతుందని పండితులు చెబుతున్నారు. కొందరు పండితులు దీన్ని దేవతా అవమానంగా కూడా భావిస్తారు. ముఖ్యంగా వంట అనేది అన్నపూర్ణ దేవికి అంకితం చేసిన పవిత్రకార్యం అనే భావన ఉంటుంది. అలాంటి సమయంలో వంట పాత్రలను తలకిందులుగా పెట్టడం ఆమెను అవమానించేనట్లే అని చెబుతుంటారు.
శుభ్రతతో పాటు…
ఇలాంటి ఆచారాలు పూర్వకాలం నుండి మన సంస్కృతిలో భాగమై ఉన్నాయి. వంటగదిలో శుభ్రతతో పాటు సానుకూల వాతావరణం ఉండటం చాలా ముఖ్యం. పాన్‌ను తలకిందులుగా ఉంచడం వలన వంటగదిలో ప్రతికూల వాతావరణం ఏర్పడి, ఆ శక్తి కుటుంబ సభ్యుల మనస్థితి మీద ప్రభావం చూపుతుందని నమ్మకం ఉంది. ఫలితంగా ఇంట్లో చిన్న విషయాలపై గొడవలు జరుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆర్థిక పరమైన దృష్టి..
అలాగే ఆర్థిక పరమైన దృష్టిలో కూడా ఇది ప్రతికూల ఫలితాలు ఇస్తుందట. వాస్తు నిపుణులు చెబుతున్న వివరాల ప్రకారం, వంటగదిలో అశుభకరంగా పాన్ ఉంచడం వలన ఆర్థిక ప్రవాహం నిలిచిపోతుంది. కుటుంబ ఆదాయం తగ్గిపోవడం, అప్పుల సమస్యలు ఎదురుకావడం, వ్యాపారంలో నష్టాలు కలగడం వంటి పరిణామాలు చోటు చేసుకోవచ్చని చెబుతున్నారు. కొందరి అభిప్రాయం ప్రకారం, దీని వలన శ్రేయస్సు తగ్గిపోతుంది, కుటుంబ సౌఖ్యం దెబ్బతింటుంది.
కెరీర్ పరంగానూ..
అదేవిధంగా కెరీర్ పరంగానూ దీనికి ప్రభావం ఉంటుందని చెబుతారు. పాన్ తలకిందులుగా ఉంచడం వలన వ్యక్తి పనులు సజావుగా సాగవు, ప్రయత్నించిన పనులు మధ్యలో నిలిచిపోవచ్చు. కొత్త అవకాశాలు రాకపోవడం, ఉద్యోగంలో ఒత్తిడి పెరగడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని విశ్వాసం ఉంది. వ్యాపారం చేసే వారికి కూడా ఇది లాభనష్టాలపై ప్రభావం చూపుతుందని వాస్తు నిపుణులు వివరించారు.
వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదిలో ప్రతి వస్తువుకు ఒక స్థానం ఉండాలి. పాన్‌లను శుభ్రంగా కడిగి, ఎండబెట్టిన తర్వాత సరైన ప్రదేశంలో నిల్వ చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. పాన్ తలకిందులుగా ఉంచడం వలన వంటగది శక్తి సమతౌల్యం భంగమవుతుందని, దాని ప్రభావం ఇంటి మొత్తం వాతావరణంపై పడుతుందని చెబుతారు.
స్టవ్‌పైన ఉంచడం…
మరికొందరు వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం, వంట పూర్తయిన తర్వాత పాన్‌ను స్టవ్‌పైన ఉంచడం కూడా శ్రేయస్కరం కాదట. ఎందుకంటే అది అనపూర్ణ దేవికి అవమానమని భావిస్తారు. వంటగది పవిత్ర స్థలం కాబట్టి అక్కడ ఉపయోగించే వస్తువులను గౌరవంగా ఉంచడం ముఖ్యం అని వారు సూచిస్తున్నారు.
తలకిందులుగా..
ఈ కారణాల వల్ల వంటగదిలో పాన్‌ను ఎప్పుడూ తలకిందులుగా ఉంచకూడదని నిపుణులు చెబుతున్నారు. వంట పాత్రలను శుభ్రంగా ఉంచి వాటిని సరిగా అమర్చడం వలన ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది, కుటుంబం ఆనందంగా ఉంటుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అనే నమ్మకం ఉంది.
వాస్తు నిపుణులు సూచనల ప్రకారం, వంటగదిలో వస్తువులు అమర్చేటప్పుడు దిక్కులు, ప్రదేశం, శుభ్రత మొదలైన వాటికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి. పాత్రలను తలకిందులుగా ఉంచకపోవడం ద్వారా ఇంట్లో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం మెరుగుపడతాయని చెబుతున్నారు.
ఇంటి వాతావరణంపై …
చిన్నగా కనిపించే ఈ అలవాట్లకే ఇంటి వాతావరణంపై పెద్ద ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు తరచూ గుర్తుచేస్తుంటారు. అందుకే వంటగదిలో పాన్‌లను ఎప్పుడూ సరిగా ఉంచడం, శుభ్రత పాటించడం, వంట సమయంలో సానుకూల ఆలోచనలతో ఉండడం శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.


