Friday, May 23, 2025
Homeదైవంశుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. కోటీశ్వరులు అవడం ఖాయం..!

శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే.. కోటీశ్వరులు అవడం ఖాయం..!

శుక్రవారం పుణ్యదినం. ఈ రోజున మహాలక్ష్మీదేవిని పూజిస్తే సంపద, శ్రేయస్సు, సుఖసంతోషాలు సొంతమవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. దేవతలలో ధనాధిక్యం, ఐశ్వర్యానికి ప్రతీక అయిన లక్ష్మీదేవి కృపను పొందాలంటే కొన్ని నియమాలను పాటించాలి. శుక్రవారం లక్ష్మీ పూజ ఎలా చేయాలి.. పూజా సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.

- Advertisement -

పూజ ఎలా చేయాలి: శుక్రవారం సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. ముందుగా స్నానం చేసి శుద్ధమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలాన్ని శుభ్రంగా ఉంచి పసుపు, కుంకుమతో అలంకరించాలి. గులాబీ పువ్వులు, ఎరుపు రంగు వస్త్రం, తామర పువ్వు అమ్మవారికి అర్పిస్తే ఆమె సంతోషిస్తుందని నమ్మకం. పరిమళ ద్రవ్యాలు, కర్పూర దీపం ఉపయోగించడం శ్రేష్ఠమని పండితులు చెబుతున్నారు. పూజ సమయంలో శ్రీ సూక్తం పారాయణం, శ్రీ యంత్ర ఆరాధన చేసి, చివరిగా హారతి ఇవ్వాలి.

శుక్రవారం చేయకూడని పనులు: శుక్రవారం కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి అపసరంగా మారుతుందని శాస్త్ర విశ్వాసం. ముఖ్యంగా క్రెడిట్ లావాదేవీలు, అప్పు ఇవ్వడం, తీసుకోవడం.. పూర్తిగా నివారించాలి. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుందని పురాణ విశ్వాసం. అలాగే ఈరోజు ఎవరికీ చక్కెర ఇవ్వకూడదు. శుక్ర గ్రహ ప్రభావం బలహీనపడుతుందని జ్యోతిష శాస్త్రం పేర్కొంటుంది. ఎవరికైనా, ముఖ్యంగా స్త్రీలకో, ట్రాన్స్‌జెండర్లకో అవమానకరంగా ప్రవర్తించకూడదు. వారు అనుచితంగా మాట్లాడితే కూడా శాంతంగా స్పందించాలి. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవి ఓ స్త్రీరూపంగా పూజించబడుతుంది. వారిని అవమానించడం అమ్మవారిని అవమానించినట్లే అవుతుంది.

లక్ష్మీదేవి పరిశుభ్రతను బాగా ఇష్టపడతారు. అందుకే ఇంటిని, కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలి. ముఖ్యంగా పూజా స్థలాన్ని గాలి, ధూపంతో పరిశుభ్రంగా ఉంచడం ద్వారా అమ్మవారి కృప నిరంతరం కురుస్తుంది. పూజా స్థలం ఈశాన్య కోణంలో ఉండాలి. తూర్పు ముఖంగా కూర్చుని పూజ చేయాలి. పక్కనే వంటగది, టాయిలెట్ ఉండకూడదు. లక్ష్మీదేవికి శుక్రవారం చక్కెర మిఠాయిలు, ఖీర్ వంటి స్వీట్లను నైవేద్యంగా అర్పించాలి. ఈ సమయంలో స్ఫటిక లేదా తామర గింజల జపమాలతో లక్ష్మీ మంత్రాలను – “ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమః” వంటి శ్లోకాలను జపిస్తే అమిత ఫలితాలు దక్కుతాయి. దీన్ని చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్మకం.

శుక్రవారం లక్ష్మీ పూజ చేసే సంప్రదాయం అనేది ఆధ్యాత్మిక విశ్వాసం మాత్రమే కాదు, ఒక విలువైన జీవన విధానం. పరిశుభ్రత, వినయం, ఆచరణ, నమ్రత – ఇవన్నీ లక్ష్మీదేవి పూజలో భాగం. ఈ నియమాలను పాటిస్తే ధన, ధాన్య సమృద్ధితో పాటు, సద్గుణాలు కూడా అభివృద్ధి చెందుతాయి. శుక్రవారం లక్ష్మీదేవిని క్షమ, శాంత స్వరూపంగా ఆరాధించండి ఆమె కృప ఎల్లప్పుడూ మీ ఇంటి మీద ప్రసరిస్తుంది. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో లభించిన సాధారణ సమాచారం ఆధారంగా రాసినది. దీనిని తెలుగు ప్రభ ధృవీకరించడం లేదు.)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News