Tuesday, September 17, 2024
HomeదైవంYadadri: శ్రీకృష్ణుని అలంకారంలో లక్ష్మీనరసింహుడు

Yadadri: శ్రీకృష్ణుని అలంకారంలో లక్ష్మీనరసింహుడు

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం యాదగిరిశుడు శ్రీకృష్ణుడు (మురళీకృష్ణుని) అలంకారంలో సాక్షాత్కరించారు. ఈ సందర్భంగా ఉదయం నిత్య ఆరాధనలు నిర్వహించిన అనంతరం శ్రీ స్వామివారిని మురళీకృష్ణుడిగా అలంకరించి ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా ఆలయ మాడవీధులలో ఊరేగించారు. సాయంత్రం పొన్నవాహన సేవ నిర్వహించారు ఈ సందర్భంగా అత్యంత వైభవంగా ఊరేగింపు వేడుక జరిపారు. శ్రీకృష్ణుని అలంకారం పొన్నవాహన సేవ విశిష్టతలను ప్రధాన అర్చకులు నల్లన్ తీగల్ లక్ష్మీ నరసింహ చార్యులు వివరించారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News