ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ఆలయ అర్చకులు యాదాద్రి ప్రధానాలయం మరియు పాతగుట్ట ఆలయంలో స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరాధనల అనంతరం ఆలయ అర్చకులు స్వామి అమ్మవార్లకు అష్టోత్తర శతఘటాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 కళశాలలో నింపిన వివిధ రకాల సుగంధ మూలికలతో నింపబడిన తీర్ధాన్ని స్వామి అమ్మవార్లకు అభిషేకించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాస్కరరావు ఆలయ ప్రధాన అర్చకులు నల్లందిగల్ లక్ష్మీ నరసింహచార్యులు,కాండూరి వెంకటాచార్యులు,ఉప ప్రధానార్చకులు సురేంద్రాచార్యులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఆలయ ఉద్యోగులు భక్తులు పాల్గొన్నారు.