Friday, June 28, 2024
HomeదైవంYaganti: వైభవంగా పల్లకి మహోత్సవం

Yaganti: వైభవంగా పల్లకి మహోత్సవం

బనగానపల్లె మండలంలో యాగంటి, శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు సోమవారం సందర్భముగా వైభవంగా పల్లకి మహోత్సవం నిర్వహించారు. ప్రదోషకాల ప్రత్యేక పూజల అనంతరం స్వామి, అమ్మవార్లను పల్లకిలో తీసుకువచ్చి, నంది మంటపములో వేంచేపు చేసి, పూజల అనంతరం ఆలయంలో పల్లకి ఉత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయాధికారి చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ బుచ్చిరెడ్డి, పాతపాడు సర్పంచ్ మహేష్ రెడ్డి, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News