బనగానపల్లె మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు సోమవారం సందర్భముగా వైభవంగా పల్లకి మహోత్సవం నిర్వహించారు. ప్రదోషకాల ప్రత్యేక పూజల అనంతరం స్వామి అమ్మవార్లను పల్లకి నందు నంది మంటపము నందు వేంచేపు చేసి పూజల అనంతరం ఆలయము నందు పల్లకి ఉత్సవం నిర్వహించారు.
- Advertisement -
అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఈఓ చంద్రుడు, పాతపాడు సర్పంచ్ బెడదల మహేశ్వరరెడ్డి, యాగంటి పల్లె ఉపసర్పంచ్ బండి మౌళీశ్వర రెడ్డి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.