Zodiac Signs- Tea Lovers: చాలా మందికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుందనే సంగతి తెలిసిందే. కొందరికి రోజు మొదలు కావాలంటే ఒక కప్పు టీ తప్పనిసరిగా పొట్టలో పడాల్సిందే. మరికొందరికి కాఫీ లేకపోతే రోజు గడవదు. పండితుల మాటల్లో, ఈ అలవాట్లలో కూడా మన రాశి ప్రభావం ఉంటుందని వివరిస్తున్నారు తెలుసా. కొన్ని రాశుల వారు టీ, కాఫీ పట్ల చాలా విశేషమైన ఆసక్తి చూపుతారని పండితులు వివరిస్తున్నారు. ఈ రాశుల వారు ఈ పానీయాలను కేవలం రుచికోసం కాకుండా, తమ ఉత్సాహం, సృజనాత్మకత, ఆలోచనలకు ఇంధనంగా కూడా చెబుతుంటారు.
మేష రాశి..
మేష రాశి వారికి కాఫీ అంటే జీవన శక్తి లాంటిది. రోజంతా చురుకుగా ఉండడానికి, ఉత్సాహాన్ని నిలబెట్టుకోవడానికి కాఫీని విరివిగా ఉపయోగిస్తారు. మేష రాశి వారు ఎప్పుడూ ముందుండే స్వభావం కలిగిన వారు. ఉదయం ఒక కప్పు కాఫీ తాగితేనే తమ రోజు పూర్తవుతుందని భావిస్తారు. సంతోషంగా ఉన్నా, ఒత్తిడిలో ఉన్నా, కాఫీ వారి మూడ్‌కి మేజిక్‌లా పని చేస్తుంది. ఈ రాశి వారు కాఫీని కేవలం పానీయం కాదు, ప్రేరణగా చూస్తారు.
Also Read: https://teluguprabha.net/devotional-news/vastu-plants-that-help-reduce-financial-problems/
మిథున రాశి..
మిథున రాశి వారు మాటల్లో చురుకుగా, ఆలోచనల్లో వేగంగా ఉంటారు. ప్రయాణం, పరిచయాలు, కొత్త అనుభవాలు వీరికి చాలా ఇష్టం. ప్రయాణాల సమయంలో ఒక కప్పు కాఫీ లేదా టీ వారికి తోడుగా అనిపిస్తుంది. మిథున రాశి వారు సాధారణంగా రోజుకి చాలా సార్లు టీ లేదా కాఫీ తాగుతారు. వీరి మనసు ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది. అందుకే కాఫీ వీరికి ఆలోచనల్లో స్పష్టతను ఇస్తుందని నమ్ముతారు. కొందరు మిథున రాశి వారు రోజుకి 7 నుంచి 10 కప్పుల వరకు టీ లేదా కాఫీ తాగే అలవాటు కలిగి ఉంటారని జ్యోతిష్కులు చెబుతున్నారు.
కన్య రాశి…
కన్య రాశి వారు ప్రశాంతంగా ఆలోచించే, వివేకవంతులుగా పరిగణిస్తారు. వీరికి టీ అంటే ఒక ఆలోచనాత్మక విరామం. పనిలోనూ, అధ్యయనంలోనూ టీ వీరికి మంచి స్ఫూర్తినిచ్చేదిగా ఉంటుంది. కన్య రాశి వారు సాధారణంగా నాణ్యతపై ఎక్కువ దృష్టి పెడతారు. టీ రుచి, సువాసన, గుణం దేనికి రాజీపడరు. రాత్రివేళల్లో మేల్కొని ఆలోచనల్లో మునిగిపోయినప్పుడు కూడా ఒక కప్పు వేడి టీ వారికి ఆత్మశాంతిని ఇస్తుంది. ఆసక్తికరంగా, కన్య రాశి పురుషులు టీ, కాఫీని స్నేహపూర్వక సంబంధాల సూచికగా కూడా చూస్తారు. ఎవరికైనా ప్రేమతో, గౌరవంతో ఒక కప్పు టీ ఇవ్వడం వీరి సహజ లక్షణం.
సింహరాశి…
సింహరాశి వారు విలాసాన్ని ఇష్టపడే వ్యక్తులు. వీరికి కాఫీ అంటే కేవలం పానీయం కాదు, ఒక ప్రత్యేక అనుభవం. తమ జీవితంలో విలువైన విషయాల్లో కాఫీ కూడా ఒకటని వారు నమ్ముతారు. సందర్శకులు వచ్చినప్పుడు కాఫీతో ఆతిథ్యం ఇవ్వడం వీరి శైలి. ప్రపంచంలోని అన్ని రకాల కాఫీలు, టీలను రుచి చూడాలని ఆశపడతారు. సింహరాశి వారు సేకరణల మీద మక్కువ చూపుతారు. పుస్తకాలు, వస్తువులు సేకరించే వాళ్లు ఉంటే, వీరు మాత్రం కాఫీ కప్పులు, కాఫీ పొడి రకాలు సేకరించడం ఇష్టపడతారు. వీరి సోషల్ మీడియా పేజీల్లో కాఫీకి సంబంధించిన పోస్ట్‌లు అధికంగా కనిపిస్తాయి.
మకర రాశి..
మకర రాశి వారు క్రమశిక్షణతో జీవించే వ్యక్తులు. వీరికి టీ అంటే ఉత్సాహానికి మూలం. రాత్రివేళల్లో చదువుకోవడం, పని చేయడం వీరి అలవాటు. కెఫిన్ ఉన్న టీ వారికి జాగ్రత్తగా ఉండటానికి, కేంద్రీకరణ పెంచుకోవటానికి తోడ్పడుతుంది. మకర రాశి వారు టీ చరిత్రపై కూడా ఆసక్తి చూపుతారు. పాతకాలపు టీ సంప్రదాయాలు, వాటి ఉత్పత్తి గురించి తెలుసుకోవడం వీరి అభిరుచి. కొందరు మకర రాశి వారు ఇంట్లో టీకి సంబంధించిన ప్రాచీన వస్తువులు, పాత్రలను సేకరిస్తారు. వీరి ఇంట్లోకి వెళ్తే ఒక కప్పు సాంప్రదాయ టీతో ఆతిథ్యం తప్పక దొరుకుతుంది.


